పెళ్లి క్యాన్సిల్ అయింది.. కానీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు!

నటి తేజస్వి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘కేరింత’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఇలా చాలా చిత్రాల్లో నటించింది. ఆ తరువాత బిగ్ బాస్ షోలో పాల్గొని తన పాపులారిటీ పెంచుకుంది. కానీ ఆ తరువాత ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో ఫోటో షూట్లను మాత్రం షేర్ చేసేది. తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘కమిట్మెంట్’ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసి అందరికీ షాకిచ్చింది.

తన కెరీర్ లో మొదటిసారి ఈ సినిమా లిప్ లాక్ సీన్స్ లో నటించానని.. గతంలో నటించిన ముద్దు సీన్లన్నీ కూడా ఫేక్ అని చెప్పింది. ‘కమిట్మెంట్’ సినిమాలో మాత్రం నిజంగానే లిప్ కిస్ పెట్టానని అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. అందరిలానే తను కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు.. పెళ్లికి కూడా రెడీ అయ్యానని.. కానీ క్యాన్సిల్ అయిందని చెప్పింది. దీంతో తీర్ధయాత్రకి వెళ్లానని.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పింది.

ఆర్టిస్ట్ గా కెరీర్ లో ముందుకు వెళ్లాలనుకుంటే పెళ్లి చేసుకోకూడదని.. జీవితంలో పెళ్లి జోలికి వెళ్లనని తేల్చి చెప్పింది. పెళ్లి చేసుకోకపోయినా.. బాయ్ ఫ్రెండ్ తో ఉండొచ్చని.. అందులో తప్పులేదని అన్నారు. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్నట్లు వెల్లడించింది. గతంలో ఇద్దరితో డేటింగ్ చేశానని.. పదేళ్ల పాటు వ్యవహారం నడిచిందని తెలిపింది. ఇక ‘కమిట్మెంట్’ సినిమాలో తన పాత్రకి ప్రతీ హీరోయిన్ రిలేట్ అవుతుందని.. ఆడిషన్స్, రెమ్యునరేషన్, కమిట్మెంట్ ఇలా అన్నీ చూపించామని అన్నారు.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus