Trisha: ఖరీదైన ఇంటిని కొన్న నటి త్రిష… ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో గత దశాబ్దన్నర కాలం నుంచి అగ్రతారగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటిమని త్రిష ఒకరు. ఇక ఈమె వరుస సినిమాలతో ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి త్రిష ఇప్పటికీ అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన హిట్ అందుకున్నారు.

ఈ సినిమా తర్వాత ఈమెకు తిరిగి వరుస సినిమా అవకాశాలు రావడం విశేషం ఇలా వరుస అవకాశాలు రావడంతో రెమ్యూనరేషన్ విషయంలో కూడా త్రిష కాస్త డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా చెన్నైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్టు సమాచారం.ఈ ఇంటిని తన ఇష్టానికి అనుగుణంగా ఎంతో అందంగా తీర్చిదిద్దుకుంటుందని తెలుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం త్రిష చెన్నైలో ఏకంగా 35 కోట్ల విలువ చేసి అందమైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఈ ఇంటిలో త్రిష అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటున్నారని అలాగే ప్రత్యేకంగా ఒక పూజ గది,తన ఇష్టాలకు అనుగుణంగా అన్ని హంగులతో అధునాతన సౌకర్యాలతో ఈ ఇంటిని తీర్చిదిద్దుకుంటున్నట్లు సమాచారం. ఇలా త్రిష అన్ని హంగులతో ఉన్న ఈ కొత్త ఇంటిని సొంతం చేసుకోవడం కోసం సుమారు 35 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలియడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది.

ఇక ఈమె ఫ్యూచర్లో పెళ్లి చేసుకొని ఇదే ఇంట్లోనే ఉండబోతుందని సమాచారం. ఇక తాజాగా ఈమె నటుడు విజయ్ తో కలిసి తన 67వ సినిమాలో నటించబోతున్నారు ఇటీవల ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించారు. దీనితో పాటు పొన్నియన్ సెల్వన్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus