Trisha: నా చుట్టూ అంతా అలాంటి వాళ్లే ఉన్నారు.. త్రిష కామెంట్స్ వైరల్!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో త్రిష ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇంకా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ త్రిష తన అందచందాలతో, నటనతో ప్రేక్షకులు ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు.ఇకపోతే తాజాగా త్రిష మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా ద్వారా మరోసారి త్రిష అభిమానులను పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా త్రిష ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా తన పెళ్లి గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా త్రిష పెళ్లి గురించి మాట్లాడుతూ చాలామంది తన పెళ్లి గురించి ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తుంటారని ఈమె అసహనం వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలామంది ప్రశ్నిస్తుంటారని ఈ ప్రశ్న తనకు చాలా చిరాకు తెప్పిస్తుందని వెల్లడించారు.ఎవరైనా మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగితే సమాధానం చెబుతానని ఈమె తెలిపారు. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ…నాతో జీవితాంతం ఉండగలిగే వ్యక్తి ఇతనే అనే భావన నాలో కలిగినప్పుడే నేను పెళ్లి చేసుకుంటానని అలాంటి మిస్టర్ పర్ఫెక్ట్ కోసం తాను ఎదురు చూస్తున్నానని తెలిపారు.

ఇకపోతే విడాకుల పట్ల తనకు ఏమాత్రం నమ్మకం లేదని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం అసలే ఇష్టం ఉండదంట తెలిపారు. నా చుట్టూ పెళ్లి చేసుకొని జీవితంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ విడాకులు తీసుకున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి పెళ్లి తాను చేసుకోవాలనుకోలేదని ఈ సందర్భంగా త్రిష పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus