అన్ని బ్రేకప్ లు అయ్యాక.. ఇప్పుడు అలా తల్లయ్యింది..!

సెలబ్రిటీలు ప్రేమ, సహజీవనం,పెళ్లి వంటి విషయాల్లో ఎంత ఫాస్ట్ గా ఉంటారో విడిపోవడంలో కూడా అంతే ఫాస్ట్ గా ఉంటారన్న విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. గ్రాండ్ గా పెద్దల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకుని కూడా కొన్ని సంవత్సరాలకే విడిపోతూ ఉంటారు. ఒకప్పుడు ఈ కల్చర్ బాలీవుడ్లో ఎక్కువగా ఉండేది. కాలక్రమేణా అది సౌత్ కు కూడా పాకింది. ఇక ఇప్పటి సంగతి చెప్పనవసరం లేదు. ఇదిలా ఉండగా..

బుల్లితెర నటి, యాంకర్‌, సింగర్‌ అనూష దండేకర్ ఎక్కువ మందికి తెలిసుండక పోవచ్చు. గతంలో ఈమె నటుడు కరణ్‌ కుంద్రాతో డేటింగ్ చేసింది. కానీ వీరి బంధం ఎంతో కాలం నిలబడలేదు. కొన్నాళ్ళకి మళ్ళీ మోడల్‌ జాసన్‌ షాను ప్రేమించింది. వీళ్ళు కూడా తమ ప్రేమను అధికారికంగా ప్రకటించి కొన్నాళ్ళు చెట్టాపట్టాలేసుకుని తిరిగేశారు! కానీ గతేడాది వీళ్ళిద్దరూ విడిపోయినట్టు పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీరు కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసుకోవడం వల్ల ఈ విషయం బయటపడింది.

ఇది పక్కన పెట్టేస్తే.. 40 ఏళ్ళ వయసులో ఈమె తల్లయ్యింది. బ్రేకప్ తర్వాత తల్లి అవ్వడం ఏంటి అని కంగారు పడకండి.ఆమె ఓ పాపని దత్తత తీసుకుంది అంతే. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. నేను అమ్మనయ్యానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ‘ఈ చిన్నారి ఏంజెల్‌ సహారా ఇప్పుడు నా సొంతం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురితో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసింది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

1

2

3

4

5

6

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus