Mahesh Babu, Rajamouli: మహేష్ రాజమౌళి మూవీలో ఆ స్టార్ హీరోయిన్ కు ఛాన్స్ దక్కిందా?

Advertisement

మహేష్(Mahesh Babu)  రాజమౌళి (SS Rajamouli)  కాంబో సినిమాలో హీరోయిన్ గా చెల్సియా ఇస్లాన్ నటిస్తున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి కానీ మహేష్ బాబు కానీ వైరల్ అయిన ఈ వార్తను ధృవీకరించలేదు. అయితే ఈ సినిమాలో అలియా భట్ (Alia Bhatt) హీరోయిన్ గా నటించనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. తన సినిమాలలో హీరోయిన్లను రిపీట్ చేయడానికి జక్కన్న ఇష్టపడరు. హీరోయిన్ అనుష్కను (Anushka Shetty) మాత్రమే ఎక్కువగా రిపీట్ చేసిన జక్కన్న ఆర్ఆర్ఆర్ (RRR) మూవీలో అలియా భట్ నటన నచ్చడంతో ఆమెను మళ్లీ రిపీట్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సినిమాలో మహేష్ పాత్ర చాలా ఇంటెన్స్ తో ఉంటుందని తెలుస్తోంది. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. అయితే అలియా నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విల్బర్ స్మిత్ నవలల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లే ఉంటుందని సమాచారం అందుతోంది. అలియా భట్ తెలుగులో మరింత బిజీ అయితే మాత్రం ఆమె అభిమానులు ఎంతో సంతోషించే అవకాశాలు అయితే ఉంటాయి.

మహేష్ రాజమౌళి కాంబో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటి కాగా కీరవాణి (M. M. Keeravani) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో భాషతో సంబంధం లేకుండా హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వేగంగా ఈ సినిమా షూట్ మొదలైతే అంతే వేగంగా ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంటుంది.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఎక్కువ సంఖ్యలో భాషల్లో రిలీజైతే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా టాలీవుడ్ స్థాయిని మరింత పెంచడం గ్యారంటీ అని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus