సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మే నెలలో ఆల్రెడీ.. వనిత విజయ్ కుమార్ మాజీ భర్త పీటర్ పాల్ అలాగే ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య, సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడి కొడుకు ,బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా తండ్రి వీరేంద్ర ఖురానా అలియాస్ పి.ఖురానా, సీనియర్ నటుడు శరత్ బాబు,బెంగాలీ నటి సుచంద్ర దాస్‌గుప్తా,ఆర్.ఆర్.ఆర్ నటుడు స్టీవెన్ సన్ వంటి వారు మరణించారు. ఈ షాక్ ల నుండి ఇంకా సినీ పరిశ్రమ కోలుకోకముందే మరో నటి రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరికీ పెద్ద షాకిచ్చినట్టైంది.
వివరాల్లోకి వెళితే.. బుల్లితెర నటి వైభవి ఉపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈమె వయసు 32 ఏళ్ళు మాత్రమే కావడం విషాదకరం. విషయంలోకి వెళితే.. వైభవి తన ప్రియుడితో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చూసుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. ఈ ఘోరమైన సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. ‘సారాబాయ్ వర్సెస్ సారాభాయ్’ అనే టీవీ షో ద్వారా వైభవి ఉపాధ్యాయ బాగా పాపులర్ అయ్యింది.
అందులో (Vaibhavi Upadhyaya) ఆమె జాస్మిన్ పాత్ర పోషించి క్రేజ్ ను సంపాదించుకుంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగా.. ఆమె మరణించడం విషాదకరం. ఇక ‘సారాబాయ్ వర్సెస్ సారాభాయ్’ షో ప్రొడ్యూసర్ జేడీ మజీతియా నటి వైభవి ఉపాధ్యాయ మృతిని కన్ఫర్మ్ చేశారు. ఈరోజు ముంబాయిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇక ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె సన్నిహితులు కోరుకుంటున్నారు.