Vaishnavi Chaitanya: ఆ కండిషన్ ఓకే అయితేనే సినిమాలకు కమిట్ అవుతున్న వైష్ణవి చైతన్య!

వైష్ణవి చైతన్య ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్నటువంటి పేరు. యూట్యూబర్గా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైష్ణవి చైతన్య అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. కెరియర్ మొదట్లో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించినటువంటి వైష్ణవి చైతన్య ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలను అందుకుంటున్నారు. వైష్ణవి చైతన్య హీరోగా నటించిన బేబీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసింది.

ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈమెకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇలా వరుస ఆఫర్ రావడంతో కెరియర్ పరంగా వైష్ణవి చైతన్య బిజీ అవుతున్నారు. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో అవకాశాలు వచ్చినప్పుడే వీరు సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత ఉంది అయితే (Vaishnavi Chaitanya) వైష్ణవి చైతన్య ఈ సామెతను అనుసరిస్తున్నారని తెలుస్తుంది.

మొదటి సినిమా సక్సెస్ కావడంతో ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నటువంటి తరుణంలో తదుపరి సినిమాలకు భారీగా కండిషన్లు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఈమె రెండో సినిమాకి దర్శక నిర్మాతలకు కండిషన్స్ పెట్టారని ఈ కండిషన్స్ కి ఒప్పుకుంటేనే సినిమాకు సాయం చేస్తాను అంటూ భీష్మించుకొని కూర్చున్నారని తెలుస్తోంది.

తాను సినిమాలకు సైన్ చేయాలి అంటే ముందుగానే తనకు అడ్వాన్స్ చెల్లించాలని అదేవిధంగా ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తేనే సినిమాలలో నటిస్తాను అంటూ కరాకండిగా చెబుతున్నారట.ఇలా రెండో సినిమాకి వైష్ణవి చైతన్య ఈ స్థాయిలో కండిషన్స్ పెట్టడంతో పలువురు ఈమె పట్ల విమర్శలు కురిపిస్తున్నారు. కెరియర్ మొదట్లోనే ఇలాంటి కండిషన్స్ పెడితే కెరియర్ పైనే ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus