‘దేవత’ సీరియల్ నటి వైష్ణవి సీమంతం ఫోటోలు వైరల్

  • January 20, 2023 / 12:43 AM IST

బుల్లితెర నటీనటులకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో వైష్ణవి రామిరెడ్డి కూడా ఒకరు. అనేక సీరియల్స్ లో తన అద్భుతమైన నటనతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే దేవత సీరియల్‌తో ఇంకా పాపులర్ అయ్యింది. సత్య అనే పాత్రలో ఈమె తన మార్క్ నటనతో అలరిస్తూ ఉంటుంది. తన ప్రియుడిని.. తన అక్కకు ఇచ్చి పెళ్ళి చేసి ఆ తర్వాత గర్భం దాల్చిన సంగతి తెలిసి కృంగిపోయే అమ్మాయిగా ఈమె కనిపించింది.

అయితే తర్వాత ఆ సీరియల్ నుండి ఈమె అనూహ్యంగా తప్పుకుంది. కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది. 2022 మే లో ఈమె ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ డైరెక్టర్ సురేష్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్లో… వైరల్ అయ్యాయి. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఈమె పెళ్లి జరిగింది.

ఇక ఈమె తల్లి కాబోతున్నట్లు కూడా మొన్నామధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె సీమంతం వేడుక ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus