అప్పట్లో విజయశాంతి, రోజా…ఇప్పట్లో సాయి పల్లవి

స్టార్ డమ్ సంగతి పక్కన పెడితే కొందరు హీరోయిన్స్ కి నటనకు స్కోప్ ఉన్న పాత్రలు దక్కుతాయి. పాత్రలో డెప్త్ ఉంటే టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ని ఏరికోరి మరీ తీసుకుంటారు దర్శకులు. నేటి తరం హీరోయిన్స్ లో ఆ కేటగిరికి చెందిన హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పొచ్చు. మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన సాయి పల్లవి మొదటి చిత్రంతోనే తానేమిటో నిరూపించుకుంది. తెలుగులో ఫిధా సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. సాయి పల్లవి యాక్టింగ్ కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది ఇక్కడ.

కాగా సాయి పల్లవి తన నెక్స్ట్ చిత్రంలో నక్సలైట్ గా చేస్తుంది. రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కుతున్న విరాట పర్వం సినిమాలో ఈమె నక్సలైట్ రోల్ చేస్తుందని సమాచారం. కెరీర్ బిగినింగ్ లోనే ఇలాంటి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర రావడం విశేషమే. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ప్రియమణి కూడా నక్సలైట్ రోల్ చేస్తున్నారు. ఈ తరం హీరోయిన్స్ లో నక్సలైట్ రోల్ చేసిన అమ్మాయి బహుశా సాయి పల్లవి నే అయివుంటుంది.

ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ లేడీ అమితాబ్ అనిపించుకున్న విజయ శాంతి ఒసేయ్ రాములమ్మ సినిమాలో నక్సలైట్ రోల్ చేశారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో 1997లో వచ్చిన ఆ సినిమా ఓ సంచలనం. 25వారాలు ఆడిన ఆ సినిమా విజయశాంతి కెరీర్ లో మరపురాని చిత్రం. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో రౌడీ దర్బార్ అనే మరో మూవీ చేశారు. ఆ సినిమాలో కూడా విజయశాంతి నక్సల్ రోల్ చేశారు. ఇక అప్పటి తరం హీరోయిన్స్ లో రోజా కూడా నక్సలైట్ రోల్ చేశారు. స్వర్ణక్క అనే పేరుతో తెరకెక్కిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఆమె నక్సల్ పాత్ర చేయడం జరిగింది. ఇలా సాయి పల్లవి, విజయ శాంతి, రోజా స్టార్ హీరోయిన్స్ హోదాలో ఉంది, నక్సలైట్ రోల్స్ చేశారు.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus