Yami Gautam: ప్రముఖ డైరెక్టర్‌ను పెళ్లాడిన హీరోయిన్‌ యామి గౌతమ్..!

మొన్నటికి మొన్న హీరోయిన్ ప్రణీత సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. దాని నుండీ అంతా ఇంకా బయటపడకుండానే మరో హీరోయిన్‌ కూడా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని పెద్ద షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. హీరోయిన్ యామి గౌతమ్‌ తాజాగా పెళ్లి పీటలెక్కింది. బాలీవుడ్‌ లో ‘ఉరి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్యతో 3 ముళ్లు వేయించుకుని, 7 అడుగులు నడిచింది.

కోవిడ్‌ సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. కేవలం ఇరు కుటుంబాలు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. అనంతరం ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది యామి. ‘మ్యారీడ్ లైఫ్ ను స్టార్ట్ చేశాం’ అంటూ తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. తెలుగులో యామి గౌతమ్.. ‘నువ్విలా’, ‘గౌరవం’, ‘యుద్ధం’ ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్’ వంటి చిత్రాల్లో నటించింది.

కెరీర్ ప్రారంభంలో.. ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ యాడ్‌లో నటించి ప్రేక్షకులకు పరిచయమైన యామి ఆ తర్వాత ‘ఉల్లాస ఉత్సాహ’ అనే కన్నడ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.అటు తర్వాత ‘విక్కీ డోనర్‌’ వంటి సూపర్ హిట్ మూవీలో కూడా నటించింది. ఈ మూవీకి గాను యామి.. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును కూడా కైవసం చేసుకుంది. ప్రస్తుతం యామి గౌతమ్… ‘భూత్‌ పోలీస్‌’ ‘దస్వి’, ‘ఎ థర్స్‌డే’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus