Yashika Aannand: నటి యాషిక ఆనంద్ కారుకి యాక్సిడెంట్..పరిస్థితి విషమం!

ప్రముఖ నటి యాషిక ఆనంద్ కారు యాక్సిడెంట్ పెళ్లయ్యింది. శనివారం నాడు రాత్రి తమిళనాడులో ఈ ఘోర సంఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కార్ లో కోలీవుడ్‌ నటి మరియు బిగ్‌బాస్‌ ఫేమ్‌ అయిన యాషిక ఆనంద్‌ తో పాటు ఆమె స్నేహితురాలు భవాని అలాగే వారి ఇద్దరి స్నేహితులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే భవాని స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది.

ఇక యాషిక ఆనంద్ అలాగే మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయలవ్వడంతో అక్కడి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యాషిక పారిస్థితి విషమంగా ఉందని వైద్య నిపుణులు చెప్పినట్టు చెన్నై మీడియా వర్గాల సమాచారం. వీకెండ్‌ సందర్భంగా శనివారం రాత్రి యాషిక తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి తమిళనాడులోని, మహాబలిపురంకు లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లిందట.అప్పటికే అర్ధరాత్రి ఒంటిగంట కావస్తుండడం… అలాగే వీరికి నిద్ర మత్తు కూడా స్టార్ట్ అవ్వడంతో.. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టినట్టు తెలుస్తుంది.

ఈ ఘోర ప్రమాదానికి కారణం అతి వేగమే అని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.యాషిక ‘దురవంగల్‌ పత్తినారు'(తెలుగులో ’16’ అనే మూవీ)తో తెరంగేట్రం చేసింది.అటు తరువాత కమల్‌హాసన్‌ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్’ రియాల్టీ షోలో కూడా పాల్గొంది.విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ అలాగే నయనతార నటించిన ‘అమ్మోరు తల్లి’ వంటి చిత్రాల్లో కూడా నటించింది యాషిక ఆనంద్.ఇదిలా ఉండగా.. యాషిక త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus