మలయాళ చిత్ర సీమలో మహిళల పరిస్థితి గురించి తెలుసుకోవడానికి, వాళ్ల ఇబ్బందులను బయట పెట్టడానికి జస్టిస్ హేమ నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఆ రిపోర్టు రావడం రావడం మొత్తం పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇతర భాషల పరిశ్రమల్లోనూ అలాంటి కమిటీ ఏర్పాటు చేయాలనే వాదనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్లు కొంతమంది కాస్టింగ్ కౌచ్ గురించి మళ్లీ మాట్లాడుతున్నారు. గతంలోనే చాలాసార్లు ఈ విషయం గురించి మాట్లాడినవాళ్లు ఇప్పుడు జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు వచ్చిన నేపథ్యంలో మరోసారి ఆ విషయం గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా చర్చిస్తున్నారు.
అలా కథానాయిక అదా శర్మ (Adah Sharma) కూడా మాట్లాడింది. అయితే తనదైన శైలిలో సెటైరికల్‌గా విషయం చెబుతూనే, తన ఆలోచన విధానాన్ని కూడా వివరించింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. మీరు ఎప్పుడైనా క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులను ఎదుర్కొన్నారా అని అదా శర్మను అడిగితే.. నేను నేల మీదనే కూర్చున్నాను.. సోఫా (కౌచ్)లో కూర్చోవాలని అనుకోలేదు అని తనదైన శైలిలో సమాధానం చెప్పింది.
అంటే పరిస్థితిని అంతవరకు ఎప్పుడూ తీసుకురాలేదు అని ఆమె ఉద్దేశం. ఈ మాటలతో పాటు జీవితంలో ఎలా ధైర్యంగా ఉండాలి అనే విషయం కూడా చెప్పింది. సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఎంత వేగంగా రియాక్ట్ అవుతామో.. మనతో తప్పుగా ప్రవర్తించాలని ఎవరైనా చూస్తే అంతే వేగంగా స్పందించాలి. అంతేకానీ పక్కవారి అభిప్రాయాలను పట్టించుకోకూడదు. మనం ఏ రంగంలో ఉన్నా సరైన సపోర్ట్ నెట్‌వర్క్ ఉండటం ముఖ్యం. అలా నాకు ఇండస్ట్రీలో మద్దతు ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు అని అదా (Adah Sharma) చెప్పింది.
ఇక ‘హార్ట్ ఎటాక్’ (Heart Attack) సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అదా శర్మ (Adah Sharma).. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (S/O Satyamurthy), ‘గరం’ (Garam) , ‘క్షణం’ (Kshanam), ‘కల్కి’ తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఆ తర్వాత తన తొలి పరిశ్రమ అయిన బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. ‘కేరళ స్టోరీ’ (The Kerala Story) అనే సినిమాతో వచ్చి భారీ విజయం అందుకుంది. ఆ సినిమా మంచి విజయం అందుకున్నా.. ఆ తర్వాత అదే ఫ్లోలో చేసిన ‘బస్తర్’ తేడా కొట్టేసింది. ఇప్పుడడు ‘ది గేమ్ ఆఫ్ గిర్గిత్’ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.