Yash: యశ్ కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో యశ్ కు (Yash) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. యశ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సైతం అదరగొడుతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ (KGF) , కేజీఎఫ్2 (KGF2)  సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న యశ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం కెరీర్ పరంగా ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యశ్ కొత్త మూవీ టాక్సిక్ టైటిల్ తో తెరకెక్కుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు తల్లి సెంటిమెంట్ తో తెరకెక్కగా టాక్సిక్ సినిమాలో సైతం లేడీ సెంటిమెంట్ ఉంటుందని తెలుస్తోంది.

Yash

తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్ తో యశ్ (Yash) సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యశ్ ఈ సినిమా కోసం రికార్డ్ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు. టాక్సిక్ సినిమా కథ, కథనం విషయంలో సైతం యశ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.

పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉన్న యశ్ తన సినిమాలలో అద్భుతమైన కంటెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సెంటిమెంట్ సైతం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. గీతూ మోహన్ దాస్  (Geetu Mohandas)  టాక్సిక్ v మూవీని తెరకెక్కిస్తుండగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. యశ్ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

యశ్ (Yash) కెరీర్ ప్లానింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. బ్యాగ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి ఎదిగిన యశ్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. కన్నడ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో యశ్ ముందువరసలో ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉండటం కూడా యశ్ కెరీర్ కు ఊహించని స్థాయిలో ప్లస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

’35- చిన్న కథ కాదు’ …రానా అండ్ టీంకి లాభమా? నష్టమా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus