Adah Sharma: ‘ది కేరళ స్టోరీ’ బ్యూటీ అదా శర్మకి ఏమైనట్టు..!

ఇటీవల రిలీజ్ అయిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం ఎన్ని వివాదాలకు దారి తీసిందో అందరికీ తెలుసు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎంత భారీగా కలెక్ట్ చేసిందో కూడా అందరూ చూశారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.235 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ చిత్రం.. “కేరళలో అమాయకపు అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో మతమార్పిడి చేసి వారిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద క్యాంపుల్లోకి పంపడం వంటి అంశాలు హింసని ప్రేరేపించినట్టు, వివాదాస్పదంగా ఉన్నట్లు భావించి విడుదలను అడ్డుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు.

అయినా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో నటించిన నటీనటులు అందరికీ మంచి పేరొచ్చింది. ఇక ఈ చిత్రంలో అదాశర్మ కూడా నటించిన సంగతి తెలిసిందే. 15 ఏళ్లుగా రాని గుర్తింపు ఆమెకు ఈ ఒక్క చిత్రంతో లభించినట్టు అయ్యింది. ఆమె కెరీర్ మొత్తంలో ఈ మూవీ ఆమెకు చాలా స్పెషల్ అని చెప్పాలి. అందుకే ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడి పనిచేసింది. ఆ విషయాన్ని తెలుపుతూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ చిత్రం షూటింగ్ ఆఫ్ఘనిస్తాన్ లో జరిగినపుడు.. (Adah Sharma) తన ముఖానికి గాయాలైనట్టు ఆమె తన ఫోటోల ద్వారా వెల్లడించింది. ‘గడ్డకట్టేంత చలి, మైనస్ 16 డిగ్రీల చలిలో 40 గంటలు ఉన్నాం. దీంతో డీ హైడ్రేషన్ కారణంగా నా పెదాలు పగిలిపోయాయి. నీరసంతో కింద పడిపోయాను. అందువల్ల నా ముఖానికి గాయాలు అయ్యాయి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus