జబర్దస్త్ కార్యక్రమంలో మాజీ టీం లీడర్ గా పనిచేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అదిరే అభి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అది గత కొంతకాలంగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి ఈయన దూరమైనప్పటికీ మల్లెమాల వారి గురించి వారు ఇచ్చే రెమ్యూనరేషన్ల గురించి ఎవరైనా మాట్లాడితే అభి వెంటనే స్పందిస్తారు. గతంలో కిరాక్ ఆర్పీ మల్లెమాల వారి గురించి చేసిన కామెంట్లపై అదిరే అభి స్పందిస్తూ మల్లెమాలవారికి మద్దతు తెలిపిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకుంటూ జబర్దస్త్ లో ఎక్కువ రెమ్యూనరేషన్లు ఇస్తారని, ఢీకార్యక్రమంలో పెద్దగా రెమ్యూనరేషన్లు ఇవ్వరు అంటూ కామెంట్స్ చేశారు అయితే ఈ కామెంట్లపై స్పందించిన అది పలు విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీ లోకి ఎవరైనా రావాలి అనుకుంటే ప్లాన్ బి తో సహా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని తెలిపారు. ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోయినా మనం ప్లాన్ బి ఉపయోగించుకొని కెరియర్లు ముందుకు వెళ్ళవచ్చు.
ఇండస్ట్రీలో వచ్చిన సంపాదనలో కొంత భాగం కూడా పెట్టుకోవాలి అప్పుడే అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడుతుంది వచ్చినది వచ్చినట్ల ఖర్చు చేస్తే పరిస్థితులు తలకిందుల అవుతాయని తెలిపారు.. ఇక ఇండస్ట్రీలోకి ఎవరూ కూడా ఎవరిని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించరని,ఎవడి కష్టాలు వాడు పడుతూ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలని తెలియజేశారు. జబర్దస్త్ కార్యక్రమంలో పనిచేసే వారికి ఎక్కువ రెమ్యూనరేషన్లు ఇస్తారనే విషయం గురించి కూడా ఈయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎక్కువ టిఆర్పి రేటింగ్ వస్తుంది.
ఈ కార్యక్రమం చాలా మందికి రీచ్ అవుతుంది కనుక ఆ కార్యక్రమంలో నటించే వారికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు. కేవలం జబర్దస్త్ కార్యక్రమం అని మాత్రమే కాదు బుల్లితెరపై ప్రసారమయ్యే ఏ కార్యక్రమంలో అయినా అధిక రేటింగ్ వస్తే వారికి తప్పకుండా రెమ్యూనరేషన్ ఇస్తారని ఈ సందర్భంగా అభి (Adhire Abhi) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.