బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం నామినేషన్స్ చప్పగా జరిగాయి. అక్కడకక్కడ హీటెడ్ ఆర్గ్యూమెంట్స్ అయినా కూడా హౌస్ మేట్స్ ఎక్కువగా లాజిక్స్ వర్కౌట్ చేశారు. ఇక్కడే ఆదిరెడ్డి తను మైక్ విసిరేసింది బిగ్ బాస్ వల్లే అని, బిగ్ బాస్ ని తప్పుబట్టి నామినేట్ చేయాలని అన్నాడు. గీతు చేసిన పనికి ఎనౌన్స్ మెంట్ ఇచ్చి ఉంటే నాకు అంత కోపం వచ్చేది కాదనీ, ఆ కోపం రావడానికి బిగ్ బాస్ కారణం కాబట్టి మనం బిగ్ బాస్ ని నామినేట్ చేద్దామని రెచ్చిపో యాడు.
మిషన్ ఇంపాజబుల్ టాస్క్ లో బ్లూటీమ్ కి స్క్వాడ్ లీడర్ గా ఉన్న ఆదిరెడ్డి గీతు చేసిన పనికి ఆవేశంతో టీషర్ట్ విప్పి పారేసిన సంగతి తెలిసిందే. ఈ కోపంలోనే తను మైక్ ఉన్న సంగతి మర్చిపోయాడు. అందుకే, మైక్ తో సహా విసిరేశాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని హౌస్ మేట్స్ నామినేషన్స్ లో వాడుకున్నారు. వాసంతీ, మెరీనా , రోహిత్ ఇంకా రేవంత్ నలుగురు ఆదిరెడ్డిని నామినేట్ చేశారు. వాసంతీ మైక్ విసిరేయడం వల్ల బ్లూటీమ్ కి అవకాశం రాకుండా పోయిందని అభిప్రాయపడింది.
మెరీనా కూడా ఇదే రీజన్ చెప్పినపుడు ఆదిరెడ్డి బరెస్ట్ అయ్యాడు. అన్ ఫెయిర్ గేమ్ ఆడారని అది బిగ్ బాస్ చెప్పి ఉండాల్సిందని అన్నాడు. దీనికి మనం బిగ్ బాస్ ని నామినేట్ చేయాలని, అన్నింటికీ కారణం ఆయనే అని అన్నాడు. మైక్ విసిరేయడం తప్పే అని అందుకే నేను నామినేషన్ యాక్సెప్ట్ చేస్తానని చెప్పాడు. ఇక రోహిత్ కూడా నామినేట్ చేసేటపుడు ర్యాంకింగ్ విషయంలో నాకు 6వ ర్యాంక్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పాడు.
అంతేకాదు, తను సమయానికి టాస్క్ లో ‘కీ’ తీయలేకపోయాను అని అయినా కూడా మీరు టీమ్ లో స్క్వాడ్ లీడర్ అయ్యి ఉండి మైక్ విసిరేయడం వల్ల ప్రాబ్లమ్ అయ్యిందని మళ్లీ అదే రీజన్ చెప్పాడు. దీంతో ఆదిరెడ్డి మరి ఏం చేద్దాం.. అందరం కలిసి బిగ్ బాస్ ని నామినేట్ చేయాలని చెప్పాడు. అంతకుముందు ఆదిరెడ్డి రేవంత్ ని, ఇంకా ఇనయని ఇద్దరినీ నామినేట్ చేశాడు. రేవంత్ దురుసుగా గేమ్ ఆడొద్దని సలహా ఇస్తూనే ఆర్గ్యూమెంట్ పెట్టుకున్నాడు. అలాగే, ఇనయని సైతం నామినేట్ చేస్తూ విన్నర్ అంటే ఎలా ఉండాలని ప్రశ్నించాడు.
వాష్ రూమ్ లోకి వెళ్లి సెల్ఫ్ హర్టింగ్ చేస్కోవడం ఏంటని ప్రశ్నించాడు. దీనికి ఇనయ నాకు బిగ్ బాస్ కి మద్యలో మీకెందుకు అని అడిగితే, ఏదైనా ఉంటే మీరు మీరు బయటకిె వెళ్లి చూస్కోండి. అంటూ సెటైర్ వేశాడు. ఇక ఈ నామినేషన్స్ లో ఆదిరెడ్డి, ఇనయ, ఇంకా శ్రీహాన్ లకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆదిరెడ్డిని, శ్రీహాన్ ని నలుగురు నామినేట్ చేస్తే ఇనయని ఏకంగా 8మంది నామినేట్ చేశారు. దీంతో మరోసారి ఇనయ హౌస్ మేట్స్ కి టార్గెట్ అయ్యింది. అదీ మేటర్.