Adipurush: ఆదిపురుష్ ఇంటర్వెల్ సీన్ ను అలా ప్లాన్ చేశారా?

ఈ ఏడాది జూన్ నెల 16వ తేదీన ఆదిపురుష్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మరో 150 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆదిపురుష్ సినిమా టీజర్ పై నెగిటివ్ కామెంట్లు వినిపించినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నారు.

ఆదిపురుష్ మూవీ ఇంటర్వెల్ సీన్ కు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటర్వెల్ సీన్ లో ప్రభాస్ రాక్షసులతో యుద్ధం చేస్తాడని ఆ యుద్ధం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ప్రభాస్ ఈ సినిమా కోసం శిక్షణ తీసుకున్నారని బోగట్టా. ఆదికావ్యం రామాయణం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో లక్ష్మణుడి రోల్ లో సన్నీ సింగ్ కనిపించనుండగా సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.

ఇంటర్వెల్ సీక్వెన్స్ సముద్రంలో జరుగుతుందని ఆ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీ సిరీస్ సంస్థ ఈ సినిమాను ఏకంగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. ఆదిపురుష్ నైజాం హక్కులు దిల్ రాజు కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది. ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మే నెలాఖరు నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది. ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను మించి హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus