Adipurush Censor Review: ‘ఆదిపురుష్’ కి సెన్సార్ టీం చెప్పిన మైనస్సులు అవే.!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. భారతీయుల ఇతిహాస గ్రంథం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు మేకర్స్. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. తిరుపతిలో అభిమానుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. అలాగే రిలీజ్ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

అన్నిటికీ మంచి స్పందన లభించింది. తాజాగా (Adipurush) సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా ‘యు’ రేటింగ్ ను జారీ చేసింది సెన్సార్ బృందం. అలాగే సినిమా వీక్షించిన తర్వాత తమ అభిప్రాయాన్ని కూడా చిత్ర బృందంతో షేర్ చేసుకున్నారు. ‘ఆదిపురుష్’ అనేది ఒక సినిమా కాదు ఇదొక అద్భుతమైన అనుభూతి అని సెన్సార్ బృందం తెలిపింది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి.

రామాయణంలో ఉన్న నైతిక విలువలు ఈ జనరేషన్ ఆడియన్స్ కు అర్థమయ్యేలా చెప్పడానికి.. మూవీ టీం ప్రభాస్ ను మెయిన్ లీడ్ గా ఎంపిక చేసుకుని చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది అని వారు అన్నారు. కాకపోతే చాలా చోట్ల గ్రాఫిక్స్ ఎక్కువగా వాడినట్టు తెలిసిపోతుంది. ముఖ్యంగా శ్రీరాముడు, లక్ష్మణుడు వంటి పాత్రలకు సి జి ఎక్కువ వాడిన ఫీలింగ్ కలిగింది అని అంటున్నారు.

ఇక రన్ టైం 179 నిమిషాలు.. అంటే 2 గంటల 59 నిమిషాల నిడివి ఉంది. అది కూడా ఒక రకంగా మైనస్ అనే చెప్పాలి. ఫైనల్ గా ‘ఆదిపురుష్’ కి సెన్సార్ టాక్ బాగానే ఉందని చెప్పాలి. ఇక కృతి సనన్ హీరోయిన్ గా నటించిన మూవీకి ఓం రౌత్ దర్శకుడు. టి.సిరీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus