Adipurush: ఆదిపురుష్ మేకర్స్ జాతకం బాలేదా.. ఇన్ని వివాదాలా?

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ వరుస వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎన్ని మార్పులు చేసినా ఆదిపురుష్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం సులువు కాదనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తుండటం గమనార్హం. అయితే ఆదిపురుష్ మేకర్స్ జాతకం బాలేదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

సెన్సార్ సర్టిఫికెట్ లేకుండానే ఆదిపురుష్ మూవీ టీజర్ విడుదలైందని బోగట్టా. కుల్దీప్ తివారీ అనే వ్యక్తి ఆదిపురుష్ సినిమాకు వ్యతిరేకంగా ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ లేకుండానే ఆదిపురుష్ టీజర్ విడుదలైందని ఆ వ్యక్తి పేర్కొనగా అలహాబాద్ కోర్టు ఇందుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని సెన్సార్ బోర్డ్ ను కోరింది. ఈ వివాదం గురించి ఆదిపురుష్ మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.

ఈ సినిమాలోని పాత్రలు ధరించిన క్యాస్టూమ్స్ విషయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఓం రౌత్ భవిష్యత్తు ఈ సినిమాపైనే ఆధారపడి ఉంది. ఈ సినిమా అంచనాలను అందుకుని ప్రభాస్ ఖాతాలో మరో హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రభాస్ సైతం కథల ఎంపికలో మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది. ప్రభాస్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రభాస్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రభాస్ మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus