Prabhas: ఆది పురుష్ ఏకంగా 15 భాషల్లో.. బిగ్గెస్ట్ రిలీజ్!

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఆది పురుష్ పై ఒక విభిన్నమైన బజ్ అయితే ఏర్పడుతోంది. రామాయణ కథ ఆధారంగా తెరపైకి రాబోతున్న ఈ చారిత్రాత్మక పౌరాణిక చిత్రం పై అంచనాలు అయితే మామూలుగా లేవు. బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తెరపైకి తీసుకు రాబోతున్న ఈ సినిమా కోసం చిత్ర నిర్మాతల్లో భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఖర్చుకు తగ్గట్లుగానే సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ప్రభాస్ ఇమేజ్ మరో స్థాయిలో పెరిగే విధంగా ప్రపంచంలోనే అత్యధిక థియేటర్లలో విడుదల చేయాలని అనుకుంటున్నారట. సినిమాను పూర్తిగా త్రీడీ ఫార్మాట్లో తెరపైకి తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక భారతదేశ చరిత్ర గురించి బాగా తెలిసిన వారికి రాముడి చరిత్ర గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది కావున ఆ ఆలోచనతోనే సినిమా కొన్ని ప్రముఖమైన దేశాల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా జపాన్ చైనా వంటి దేశాల్లో కూడా ఆది పురుష్ సినిమాను అక్కడి భాషల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా 15 భాషల్లో 15 వేలకు పైగా స్క్రీన్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో అయితే ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట ఇప్పటికే మూడు వందల కోట్లకు పైగా ఖర్చు చేయడానికి ఫిక్స్ అయ్యారు. అవసరమైతే మరో 50 కోట్లు ఖర్చు చేసి ఇతర దేశాల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రమోషన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో నటిస్తుండగా కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది. ఇక అతి భయంకరమైన రావణాసురుడి క్యారెక్టర్ లో బాలీవుడ్ టాలెంటెట్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus