Adipurush: దిగొచ్చిన ‘ఆదిపురుష్’ రైటర్.. ఇప్పుడేం ఉపయోగం..!

  • July 8, 2023 / 06:49 PM IST

ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా గత నెల అంటే జూన్ 16 న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి మొదటి షోతోనే నెగిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ అయితే బాగా వచ్చాయి కానీ .. ఆ తర్వాత సినిమా నిలబడలేదు. ‘రామాయణాన్ని’ ఇష్టమొచ్చినట్టు తీసి శ్రీరామ చంద్రుడిని, హనుమంతుడిని విమర్శించారు అంటూ నెటిజన్లు మండిపడ్డారు. అంతేకాదు ఈ సినిమాలో ;గుడ్డ నీ బాబుది, చముర నీ బాబుది, కాబట్టి కాలేదీ నీ బాబుదే’ అంటూ హనుమంతుడి పాత్రతో ఈ డైలాగ్ చెప్పించాడు డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్.

ఇలాంటి డైలాగులు హనుమంతుడి పాత్రతో పలికించడం ఏంటి అంటూ హిందూ సంఘాలు ఓ రేంజ్లో మండి పడటమే కాకుండా కేసులు వేయడం కూడా జరిగింది. అయినప్పటికీ డైలాగ్ రైటర్ మనోజ్ వెనక్కి తగ్గింది లేదు. ప్రెజంట్ జెనరేషన్ కి ‘రామాయణం’ అర్థం కావాలంటే ఇలాంటి మాస్ డైలాగ్స్ కావాలి అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేసాడు. అంతేకాదు, చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలానే నాకు రామాయణం చెప్పిందని, హనుమంతుడు మనలాంటి భక్తుడే తప్ప దేవుడు కాదని..

చాలా దిగజారుడు మాటలు మాట్లాడాడు. ఈ విషయం పై సుప్రీంకోర్టు , అలహాబాద్ హైకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. ‘ప్రజల్ని పిచ్చోళ్లు అనుకుంటున్నారా.. భవిష్యత్తు తరాలకు ఇలాంటివి చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు?’ అంటూ మనోజ్ ను కూడా ఈ కేసులో భాగస్వామిని చేసింది. ఈ క్రమంలో మనోజ్ దిగొచ్చాడు అని చెప్పాలి. “ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను.

నా రెండు చేతులు జోడించి, అందర్నీ క్షమాపణలు కోరుతున్నాను. ప్రభువు భజరంగభళి మనందరినీ ఐక్యంగా ఉంచాలని, మన సంస్కృతి సంప్రదాయాల్ని కొనసాగించేందుకు మనందరికీ శక్తిని ప్రసాదించాలని ఆశిస్తున్నాను” అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నాడు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus