ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేసిన సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. డార్లింగ్‌ను వెండితెరపై రాముడిగా చూసి మురిసిపోవాలని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ సినిమా టీజర్ చూశాక.. ఆ ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఏదో కార్టూన్‌లా ఉంది అని కొందరు అంటే.. ప్రభాస్‌ను ఇలా చూపిస్తారా? అంటూ మరికొంతమంది కోపమయ్యారు. ఆ విషయాలు పక్కనపెడితే.. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా టీమ్ అనౌన్స్ చేసింది. సినిమాను జూన్‌లో రిలీజ్ చేస్తారని ఇంతకముందే చెప్పగా.. ఇప్పుడు ఫైనల్ (?) డేట్‌ను అనౌన్స్ చేశారు.
‘ఆదిపురుష్’ సినిమాను 2020 ఆగస్టులోనే ప్రకటించారు. 2021 ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తామని ఘనంగా ప్రకటించారు కూడా. కానీ టీజర్ విషయంలో వచ్చిన నెగిటివిటీ, విమర్శల నేపథ్యంలో మార్పులు అవసరం అని భావించి.. ఇంకా పనులు ఉన్నాయి అంటూ వాయిదా వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి అనేది వాళ్లు చెప్పిన కారణం. అయితే పనులు వేగంగా అవుతున్నాయని చెబుతూ కొత్త డేట్ అనౌన్స్ చేశారు.
‘ఆదిపురుష్’ సినిమా ద్వారా శ్రీరాముడి గొప్పతనం గురించి ప్రేక్షకులకు అందించడం ఎంతో ఆనందంగా ఉంది. మరో 150 రోజుల్లో భారతదేశ పురాణ గాథాను ప్రపంచమంతా వీక్షిస్తుంది అంటూ #150DaysToAdipurush అనే హ్యాష్‌ట్యాగ్‌ను దర్శకుడు ఓం రౌత్ ట్వీట్ చేశారు. ఆ లెక్కన ‘ఆదిపురుష్’ సినిమా జూన్ 16, 2023న విడుదలవుతుంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొంది ఈ సినిమాను 3D వెర్షన్‌లో కూడా వీక్షించొచ్చు.
‘ఆదిపురుష్’ సినిమాలో సీత /జానకి పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించాడు. వీరితో పాటు సన్నీ సింగ్, సోనాల్ చౌహాన్ తదితరులు ఇతర కీలకపాత్రధారులు. రూ.550 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను హిందీ, తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో విడుదల చేస్తారు. అయితే ఈ డేట్‌కి అయినా టీమ్ సినిమాను విడుదల చేస్తుందా అనేది చూడాలి.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?