Adipurush: ప్రభాస్ సెక్యూరిటీ కోసమే అన్ని లక్షలు ఖర్చు చేశారా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఈనెల 16వ తేదీ ఐదు భాషలలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న విషయం మనకు తెలిసిందే. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో ఎంతో ఘనంగా నిర్వహించారు. వేడుకకు లక్షలాది మంది అభిమానులు తరలించారు. ఎంతోమంది అభిమానుల సమక్షంలో ఈ సినిమా వేడుక ఎంతో ఘనంగా జరిగింది.

ఇక ఈ సినిమా వేడుకలో దాదాపు 1000 మంది పోలీసులు పెద్ద ఎత్తున సెక్యూరిటీ నిర్వహించారని తెలుస్తుంది. అయితే ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంత చేసుకోవడంతో ఆయనకు మరింత సెక్యూరిటీ కల్పించడం కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేశారని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి 1000 మంది పోలీసులు సెక్యూరిటీ నిర్వహించడమే కాకుండా ప్రత్యేకంగా ప్రభాస్ కోసం దాదాపు 100 మంది ప్రవేట్ సెక్యూరిటీని నియమించారని తెలుస్తోంది.

ఇలా వీరందరి కోసం నిర్మాతలు అదనంగా 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారని సమాచారం. ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం చేతనే ఆయన కోసం ఇలా ప్రవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక కోసం మేకర్స్ సుమారు మూడు కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది.

ఇప్పటి వరకు ఏ సినిమా (Adipurush) ప్రీరిలీజ్ వేడుక కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయలేదని ఇలా ఈ సినిమా కోసమే నిర్మాతలు భారీ స్థాయిలో ఖర్చు పెట్టారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మించగా బాలీవుడ్ నటుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus