Adipurush: సమస్య రావణుడితోనే.. రాముడితో కాదట!

సంక్రాంతికి రావాల్సిన ‘ఆదిపురుష్‌’ జూన్‌ 16, 2023కి మారిపోయిందనే విషయం మీకు తెలిసిందే. అయితే ఎందుకు మారింది అనే విషయంలో టీమ్‌ ఓ లెక్క చెబుతుంటే, సోషల్‌ మీడియాలో ఇంకో మాట వినిపిస్తోంది. వీటిలో ఏది నిజం అని ప్రేక్షకులు ఆలోచిస్తుంటే.. ఇప్పుడు మరో విషయం చర్చలోకి వస్తోంది. అయితే అది సోషల్‌ మీడియా పుకార్లకు అనుబంధంగా ఉండటం గమనార్హం. సినిమా లుక్‌, నెరేషన్‌ విషయంలో సమస్యలు ఉన్నాయని వచ్చిన పుకార్లకు దగ్గరగానే కొత్త రూమర్స్‌ ఉండటం విశేషం.

‘ఆదిపురుష్‌’ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు టీజర్‌లోని ప్రభాస్‌ను చూసి ఇదేంటి.. ఇలా ఉంది టీజర్‌ అనుకున్నారు. మనుషుల్ని బొమ్మల్లా చూపించడం వారికి నచ్చలేదు. అయితే ఓ వర్గం ప్రజలు మాత్రం రామయాణంలో లేని విషయాలు చూపించేలా టీజర్‌ ఉంది, సినిమా కూడా ఇలానే ఉంటుందా అంటూ ఆందోళ వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమాకు రిపేర్లు చేయాలని చిత్రబృందం ఫిక్స్‌ అయ్యిందని వార్తలొస్తున్నాయి. సినిమాలో ఎక్కడ, ఏం మార్చాలి అనే విషయంలో గత కొద్ది రోజులుగా టీమ్‌లో చర్చలు నడుస్తున్నాయట.

ఈ క్రమంలో రాముడి పాత్రతో ఎలాంటి ఇబ్బంది లేదు.. కేవలం రావణుడి పాత్రతోనే అని ఫిక్స్‌ అయ్యారని వార్తలొస్తున్నాయి. రావణుడి సైన్యం, హనుమంతుడు సైన్యం విషయంలో మార్పులు చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారట. ఇప్పటివరకు మనం టీవీల్లో, సినిమాల్లో చూసిన పాత్రలకు ఏ మాత్రం దగ్గరగా ఆ పాత్రలు లేవని విమర్శలు వచ్చాయి. దీంతో ఓం రౌత్‌ టీమ్‌ త్వరలోనే రీషూట్‌ లేదంటే, రీ గ్రాఫిక్స్‌ వర్క్‌ స్టార్ట్‌ చేయాలని చూస్తోందట.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. వీలైనంత త్వరగా వర్క్‌ ప్రారంభిస్తారని చెబుతున్నారు. ప్రభాస్‌ లుక్‌ విషయంలో మాత్రమే విమర్శలు రావడంపై డిస్కష్‌ చేసుకున్న టీమ్‌… మోషన్‌ క్యాప్చర్‌లో అలానే కనిపిస్తారు అనే విషయాన్ని తేల్చేశాయట. కాబట్టి మిగిలిన పనులు అన్నీ చేసుకొని సినిమా విడుదల చేస్తారని అంటున్నారు. మరి దీనిపై టీమ్‌ ఏమన్నా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus