రామాయణం ఆధారంగా తెరెక్కబోతున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే చిత్రం రిలీజ్ సందర్భంగా థియేటర్లలో ఒక్క సీటును ఖాళీగానే ఉంచబోతుండటం ఆసక్తికరంగా మారింది. హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ పదిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ మునుపెన్నడూ లేనివిధంగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. వినూత్నంగానూ ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. దీంతో ఈ భారీ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.
‘ఆదిపురుష్’ (Adipurush) ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రభాస్ శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ మయం అయ్యింది. ఈక్రమంలో ఆదిపురుష్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. జూన్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐదు ప్రధాన భాషలతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుండటంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.
అయితే రాముడి పట్ల, రామాయణం పట్ల భారతీయులకు ఎంతటి గౌరవం, నమ్మకం ఉంటుందో తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదిపురుష్ రిలీజ్ కాబోతున్న థియేటర్లలో ఒక సీటును ఖాళీగానే ఉంచబోతున్నారంట. ఎందుకంటే.. రాముడు ఎక్కడ ఉన్నా.. రాముడికి సంబంధించి ఉత్సవాలు, కార్యక్రమాలు జరిగే చోట హనుమంతుడు కూడా ఉంటాడనే నమ్మకంతో ఇలా చేస్తున్నారంట.
ఇంత గొప్ప చిత్రాన్ని వీక్షించేందుకు ఆంజనేయ స్వామి వస్తాడనే సూచకంగా ఒక సీటును ఖాళీగానే ఉంచనున్నారని తెలుస్తోంది. హిందువుల నమ్మకాన్ని ‘ఆదిపురుష్’ మేకర్స్ ఇలా గౌరవించడం ఆసక్తికరంగా మారింది.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు