Adipurush: ప్రభాస్ సినిమా ఆదిపురుష్ రీషూట్ చేస్తారా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా చెప్పిన సమయానికి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. సమ్మర్ కి సినిమా వాయిదా పడిందని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం మాత్రం ఖాయమని అంటున్నారు.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టీజర్ విడుదలైన తరువాత అంచనాలన్నీ తారుమారయ్యాయి. టీజర్ లో వీఎఫ్ఎక్స్ చూసి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. విజువల్స్ అన్నీ కార్టూన్ క్యారెక్టర్స్ మాదిరి ఉన్నాయంటూ ట్రోల్ చేశారు. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసిన మేకర్స్ ఇప్పుడు కొన్ని మార్పులు చేసే పనిలో పడ్డారు. గ్రాఫిక్స్ పై వర్క్ చేస్తోన్న టీమ్.. ఇప్పుడు ప్రభాస్ ఫుటేజ్ ను కూడా మార్చాలని అనుకుంటున్నారు. దీనికోసం మళ్లీ రీషూట్ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు. తన షెడ్యూల్స్ అన్నీ బుక్ అయిపోయాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ‘సలార్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు ప్రభాస్. రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ గా వేసిన సెట్ లో సినిమా షూటింగ్ జరుగుతుంది. దీంతో పాటు ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొనాల్సి ఉంది. మరోపక్క మారుతి సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో మళ్లీ ‘ఆదిపురుష్’ కోసం కాల్షీట్స్ కేటాయించడమంటే కష్టమే. మరి ఈ సినిమాలన్నీ పక్కన పెట్టి ‘ఆదిపురుష్’ రీషూట్ లో ప్రభాస్ పాల్గొంటారేమో చూడాలి. ఇక ఈ సినిమాలో కృతిసనన్, సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో టీసిరీస్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus