Adipurush: సంక్రాంతి వార్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. చెప్పేస్తారా..!

2023 సంక్రాంతికి వచ్చేస్తాం.. అంటూ తొలుత ప్రకటించిన సినిమా ఏది? సినిమాల్ని బాగా ఫాలో అయ్యేవాళ్లు ఎవరైనా ‘ఆదిపురుష్‌’ అని ఠక్కున చెప్పేశారు. సినిమా మొదలైన తొలి రోజుల్లోనే ఈ విషయం ప్రకటించేసింది ‘ఆదిపురుష్‌’ టీమ్‌. అయితే ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేస్తున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. గతంలో వాయిదా పడినప్పుడు ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ కారణం కావొచ్చు కానీ.. ఈసారి చాలా కారణాలు ఉన్నాయి అని చెప్పొచ్చు.

వచ్చే ఏడాది పొంగల్‌ రేసులో ఉన్న సినిమాలో ఫుల్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్న సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ‘ఆదిపురుష్’ అనే చెప్పాలి. సినిమా కథ, కాస్టింగ్‌, నిర్మాణ సంస్థ.. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే.. అలా కనిపించడం లేదు. కారణం సినిమా టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌. బొమ్మల సినిమాలా ఉందని ఓవైపు విమర్శలు వస్తుంటే.. మరోవైపు సినిమాలో పాత్రలను రూపొందించిన విధానం బాగా ఇబ్బందిగా ఉందంటూ విమర్శలు వచ్చాయి.

సినిమాను అనధికారికంగా మోసుకుంటూ వచ్చిన అధికార బీజేపీ.. ఇప్పుడు సినిమాకు యాంటీ అయిపోయింది. సినిమా టీజర్‌ ఆశించిన మేర లేకపోడం.. పాత్రలను చూపించిన విధానం వారికి ఇబ్బందిగా మారింది అంటున్నారు. రాజమౌళి గ్రాఫిక్స్‌ చూసిన తెలుగు ప్రేక్షకుల కళ్లకు ఓం రౌత్‌ గ్రాఫిక్స్‌ కార్టూన్ల కంటే తక్కువగా కనిపించాయి అనే విమర్శలూ ఉన్నాయి. సినిమాను మోషన్‌ క్యాప్చర్‌ విధానంలో తెరకెక్కించడం కూడా చాలామందికి నచ్చడం లేదు. ప్రభాస్‌ లాంటి కటౌట్‌ని బొమ్మలా చూపించడం సగటు ప్రేక్షకులకు కూడా నచ్చలేదు.

అయితే మోషన్‌ క్యాప్చర్‌లో సినిమా చేస్తున్నాం అని తొలుత టీమ్‌ చెప్పినా.. ఆ తర్వాత ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ప్రేక్షకులు ఆ విషయాన్ని మరచిపోయారు అని చెప్పాలి. అలాంటి సమయంలో అభిమాన నటీనటులు బొమ్మల్లా కనిపించడంతో తట్టుకోలేకపోయారు. ఈ నష్టం సినిమా ఫలితం మీద పడకూడదు అని టీమ్‌ సినిమాను ఆలస్యం చేస్తోంది అంటున్నారు. వచ్చే సమ్మర్‌లో సినిమాను రిలీజ్‌ చేస్తారని వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికార ప్రకటన ఉండొచ్చు అని టాక్‌.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus