Aditi Rao Hydari: మా ఇద్దరిదీ చిన్నపిల్లల స్వభావం.. అదితీరావు హైదరీ కామెంట్స్ వైరల్!

సిద్దార్థ్ (Siddharth)  అదితీరావు హైదరీ (Aditi Rao Hydari)  ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకోగా పెళ్లికి సంబంధించిన శుభవార్త చెప్పనున్నారు. అయితే వరుసగా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న అదితీరావు హైదరీ చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. సిద్దార్థ్ వల్లే నాకు ప్రేమపై నమ్మకం పెరిగిందంటూ అదితీరావు హైదరీ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. సిద్ధార్థ్ నన్నెంతో మార్చారని అతని పరిచయంతో లవ్ పై నా ఒపీనియన్ పూర్తిస్థాయిలో మారిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఎన్నో విషయాలలో నా నమ్మకం నిజమైందని అదితీరావు హైదరీ పేర్కొన్నారు. మా ఇద్దరిదీ చిన్నపిల్లల స్వభావం అని ఆమె అన్నారు. ప్రేమ ఉన్నచోట గౌరవం తప్పనిసరిగా ఉంటుందని మేమిద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటామని అదితీరావు హైదరీ వెల్లడించారు. నేను ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటానని ఆమె తెలిపారు. నటీనటులపై రూమర్స్ రావడం సహజమని నాపై, సిద్దార్థ్ పై ఎన్నో గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయని అదితీరావు హైదరీ పేర్కొన్నారు.

ఆ గాసిప్స్ కు చెక్ పెట్టాలనే ఆలోచనతోనే నిశ్చితార్థం నిర్ణయాన్ని మీడియాకు ప్రకటించామని ఆమె తెలిపారు. నిశ్చితార్థం గురించి తెలుసుకున్న వారంతా శుభాకాంక్షలు తెలియజేశారని ఆమె కామెంట్లు చేశారు. సెలబ్రిటీలు కూడా మనుషులే అని ప్రజలు గ్రహించాలని అదితీరావు హైదరీ తెలిపారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించకూడదని అదితీరావు హైదరీ పేర్కొన్నారు. అందరికీ చెప్పే విషయాలు అయితే నటీనటులే చెబుతారని ఆమె అన్నారు.

అదితీరావు హైదరీకి సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది. అదితీరావు హైదరీ హీరామండీ : ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ లో నటించగా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అదితీ బిబ్బోజాన్ అనే పాత్రలో ఈ వెబ్ సిరీస్ లో నటించిన అదితీరావు హైదరీ తన నటనతో ఆకట్టుకున్నారు. త్వరలో అదితి నుంచి మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ కు సంబంధించిన ప్రకటనలు రానున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus