Aditi Rao Hydari: సిద్దార్థ్ తో పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చిన అదితి..!

సిద్ధార్థ్  (Siddharth)  – అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari)  చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య వీరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఎక్కడా కూడా పెళ్లి గురించి ప్రస్తావించింది లేదు. ‘ఇండియన్ 2’ (Indian 2) ప్రమోషన్స్ లో కూడా సిద్దార్థ్.. అదితి రావుతో తన పెళ్లి గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. అయితే అదితి రావ్ హైదరి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది. ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో నటి అదితి రావ్ హైదరి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

Aditi Rao Hydari

ఆమె మాట్లాడుతూ.. ‘సిద్దార్థ్ నాకు తన ప్రేమ విషయాన్ని.. మా నానమ్మకి చెందిన ఓ స్కూల్లో తెలియజేశాడు. మా నానమ్మ ఆశీస్సులు మాకు ఉండాలనే ఉద్దేశంతో అలా ప్రపోజ్ చేశాడు. అది నాకు బాగా నచ్చింది. మా నిశ్చితార్థం జరిగిన వనపర్తి జిల్లాలోని రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయం నాకు చాలా ప్రత్యేకమైనది. మా పెళ్లి అక్కడే జరుగుతుంది. పెళ్లి తేదీని పెద్దలు నిర్ణయిస్తారు.

వారు ఫిక్స్ చేసిన డేట్…ని, నేను సిద్దార్థ్ కలిసి సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తాం’ అంటూ అదితి రావ్ హైదరి చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో పెళ్లి ప్లేస్ గురించి అయితే అదితి క్లారిటీ ఇచ్చింది.. కానీ డేట్ గురించి ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ‘మహాసముద్రం’ (Maha Samudram) సినిమాలో సిద్దార్థ్- అదితి ప్రేమికులుగా నటించారు. నిజజీవితంలో కూడా వీరి మధ్య ప్రేమ చిగురించింది.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ నిర్మాత విషయంలో ట్విస్ట్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus