యంగ్ హీరో సినిమాకి భారీగా డిమాండ్ చేస్తున్న అదితి..!

  • June 18, 2019 / 06:39 PM IST

‘సమ్మోహనం’ ‘అంతరిక్షం’ వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైంది అదితి రావ్ హైదరి. ఇప్పుడు మరోసారి ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్లో ‘వి’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తుంది. బాలీవుడ్ లో కూడా ఈమె ‘పద్మావత్’ వంటి చిత్రంలో నటించినప్పటికీ ఎందుకో ఈమె పెద్దగా పాపులర్ అవ్వలేకపోయింది. అయితే టాలీవుడ్ లో మాత్రం ఈమెకు మంచి అవకాశాలే వస్తుండడం విశేషం. దీంతో పారితోషికం కూడా ఈమె గట్టిగానే డిమాండ్ చేస్తుందట. తాజాగా ఓ యంగ్ హీరో చిత్రం కోసం 80 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

ఆ యంగ్ హీరో మరెవరో కాదు… మన రాజ్ తరుణే..! ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ‘నీది నాదీ ఒకే లోకం’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు మరో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడట. నితిన్ కు ‘గుండె జారి గల్లంతయ్యిందే’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన విజయ్ కుమార్ కొండా డైరెక్షన్లో చేయడానికి రెడీ అవుతున్నాడంట రాజ్ తరుణ్.ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కు జోడిగా అదితి రావు హైదరి ను అనుకుంటున్నారట. అదితి ఈ సినిమా కోసం 80 లక్షలు డిమాండ్ చేస్తున్నప్పటికీ దర్శకుడు మాత్రం అదితినే కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus