స్టార్ సింగర్ ప్రభాస్ హీరోయిన్ పెళ్లి!

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. తను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న శ్వేతా అగర్వాల్ ని పెళ్లాడబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. సింగర్ గా, నటుడిగా బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య నారాయణ్ పెళ్లి విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలలో నటించిన ఆదిత్య 2010లో ‘శాపిత్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో శ్వేతా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

ఆ సినిమా సమయంలోనే వీరిమధ్య ప్రేమ చిగురించింది. దాదాపు పదేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని ఎప్పుడూ బయటకి చెప్పలేదు. కానీ మీడియాలో వీరి బంధంపై పలు రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఆదిత్య నారాయణ్ ఎట్టకేలకు తమ బంధంపై క్లారిటీ ఇచ్చారు. పదేళ్లుగా శ్వేతాతో ప్రేమలో ఉన్నప్పటికీ.. వయసురీత్యా అప్పుడే పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని ఇంతకాలం ఎదురుచూసినట్లు చెప్పాడు. ముందుగా కెరీర్ పై దృష్టి పెట్టి.. సెటిల్ అయిన తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.

ఇప్పుడు సరైన సమయమని భావించి పెళ్లికి సిద్ధమవుతున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది చివర్లో శ్వేతా అగర్వాల్ మెడలో తాళి కట్టనున్నట్లు స్పష్టం చేశాడు. ఈమెతో ప్రేమాయణం నడిపించిన సమయంలోనే ఆదిత్య.. ఇండియా ఐడల్ హోస్ట్ గా ఉన్న సింగర్ నేహా కక్కర్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సడెన్ గా శ్వేతాతో పెళ్లి అనౌన్స్ చేయడం సంచలనంగా మారింది. శ్వేతా అగర్వాల్ టాలీవుడ్ లో ప్రభాస్ నటించిన ‘రాఘవేంద్ర’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత టాలీవుడ్ లో అవకాశాలు లేక బాలీవుడ్ లోనే సెటిల్ అయింది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus