కనీస స్థాయి జ్ఞానం లేదు వాళ్ళకి : అడివి శేష్
- June 20, 2019 / 05:46 PM ISTByFilmy Focus
డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ.. మంచి టేస్ట్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు అడివి శేష్. ‘దొంగాట’ క్షణం’ ‘అమీ తుమీ’ ‘గూఢచారి’ వంటి విభిన్న చిత్రాలు హట్టవ్వడంతో శేష్ సినిమా అంటే ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా తాజాగా.. ‘ఐడియా మొబైల్ కంపెనీ’ విరుచుకుపడ్డాడు.
- గేమ్ ఓవర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- వజ్ర కవచధర గోవింద సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
అడివి శేష్… ‘అసలు విషయాన్నీ తెలుపుతూ.. “నేను విదేశాలకు వెళ్ళే సమయంలో ఐడియా కంపెనీ ఇంటర్నేషనల్ ప్యాక్ కు చార్జ్ చేసింది.కానీ విదేశాల్లో ఐడియా ప్యాక్ పనిచే్యలేదు. ఈ విషయమై ఐడియా కంపెనీ వారికి ఫిర్యాదు చేసినా.. నా అమౌంట్ ను రీఫండ్ చేయాలన్న సంస్కారం కూడా వారికి లేదు. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు… ‘ఐడియా కంపెనీ’ చాలా అనైతికంగా వ్యవహరిస్తోంది. ఇక హైదరాబాద్ లో కాల్ క్వాలిటీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ విషయంలో ఐడియా ప్రతినిధుల స్పందన అద్భుతంగా ఉంది, వాళ్ళకు కనీస పరిజ్ఞానం కూడా లేదు. దీనికితోడు ప్రతీరోజూ కస్టమర్ కేర్ కాల్స్ తో వేధించుకు తింటున్నారు. ఈ కారణాల వల్లే నేను ఐడియా నెట్ వర్క్ నుండీ మారిపోతున్నాను” అంటూ అడవిశేష్ చెప్పుకొచ్చాడు.














