తెలుగులో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు నటుడు అడివి శేష్. హీరోగానే కాకుండా ‘పంజా’, ‘బాహుబలి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అలరించారు. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘మేజర్’. ముంబై తీవ్రవాదుల దాడిలో ప్రాణాలను కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. జూన్ 3న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అడివి శేష్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అడివి శేష్. తన అసలు పేరు అడివి సన్నీ కృష్ణ అని.. కానీ అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీలియోన్ అని ఆటపట్టిస్తుండడంతో అడివి శేష్ గా మారానని అన్నారు. తన కెరీర్ ప్రారంభం గురించి మాట్లాడుతూ.. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చందమామ’ సినిమాలో నవదీప్ రోల్ లో ముందుగా తనను తీసుకున్నట్లు చెప్పారు అడివి శేష్. రెండు రోజులు షూటింగ్ కూడా జరిగిందని..
ఆ తరువాత సినిమా ఆగిపోయిందని చెప్పారని.. ఫైనల్ గా తన స్థానంలో నవదీప్ ను తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ‘సొంతం’ సినిమాలో పెద్ద రోల్ ఉందని చెప్పారని.. కట్ చేస్తే సినిమాలో ఐదు సెకన్లు మాత్రమే కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఇక ‘మేజర్’ సినిమా గురించి మాట్లాడుతూ.. సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా చనిపోయాడో అందరికీ తెలుసునని.. కానీ ఎలా బ్రతికాడనేది తెలియదని.. ఆ విషయాలను తమ సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పారు. మహేష్ బాబు నిర్మాతగా ఉండడం వలనే సినిమా సాధ్యమైందని అన్నారు.