26/11 ఎటాక్స్ లో దేశం కోసం ప్రాణాలను విడిచారు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. అలాంటి వ్యక్తి జీవితాన్ని తెరపై చూపించాలనుకున్నారు. అడివి శేష్ హీరోగా ఈ బయోపిక్ ను తెరకెక్కించారు. నిజానికి ఇలాంటి కథను బాలీవుడ్ జనాలు అసలు వదులుకోరు. అలాంటి వారందరినీ దాటుకొని ఈ కథ అడివి శేష్ దగ్గరకు ఎలా వచ్చిందనే విషయం గురించి ఆయన మాట్లాడారు. బాలీవుడ్ లో ఈ సినిమా తీయడానికి ప్రయత్నించారని.. కానీ సందీప్ తల్లిదండ్రులకు వారు నచ్చలేదని అన్నారు.
ఆ తరువాత మలయాళ మేకర్స్ కొందరు సందీప్ పేరెంట్స్ ని సంప్రదించగా.. వారు మళ్లీ ఒప్పుకోలేదని శేష్ చెప్పుకొచ్చారు. ఆ హీరోలు తమ కొడుకులా లేరని సందీప్ తల్లి సున్నితంగా తిరస్కరించారట. కానీ అడివి శేష్ ని చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యారట. తనలో సందీప్ ని చూసుకున్నారని.. ఆమెని అమ్మ అని పిలుస్తుంటానని అడివి శేష్ చెప్పుకొచ్చారు. ఇలా సందీప్ బయోపిక్ తీసే అవకాశం తమకు దక్కినట్లు వెల్లడించారు శేష్.
‘మేజర్’ సినిమాలో సందీప్ జీవితం మొత్తం కనిపించదని.. కొన్ని ఆసక్తికరమైన అంశాలను మాత్రమే తీసుకున్నామని వివరించారు. అన్నీ తీయాలంటే సమయం సరిపోదని తెలిపారు. స్కూల్ డేస్, కశ్మీర్, తాజ్ సంఘటనతో పాటు చిన్నతనంలో అమ్మతో కూర్చొని పాయసం తినడం, స్కూల్ ఎగ్గొట్టి సినిమాలు చూడటం, ఐస్ క్రీమ్‌లు తినడం, నాన్నగారితో టైప్ రైటింగ్ గురించి మాట్లాడడం..
ఇవన్నీ ఆయన లైఫ్‌లో తీసుకున్న పెద్ద నిర్ణయాలని.. గొప్ప మనుషులు గొప్ప మాటలతో పుట్టరు, వారు చేసే పని వల్ల గొప్ప మనిషి అవుతారంటూ చెప్పుకొచ్చారు అడివి శేష్.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!