అడివి శేష్ (Adivi Sesh) .. టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలు అందించడంలో ముందుంటాడు. ప్రతి సినిమాకు ఎంతో కేర్ తీసుకుని, వేరైటీ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడం వల్లనే ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. కానీ ఇప్పుడు అదే ప్లస్ లో ఓ మైనస్‌గా మారినట్టుంది. ఎందుకంటే హిట్ 2 (HIT: The Second Case) తర్వాత శేష్ నుంచి కొత్త సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఏ హీరో అయినా గ్యాప్ ఎక్కువ అయితే ప్రేక్షకుల ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది.
గూఢచారి 2 (Goodachari 2) , డెకాయిట్ రెండు సినిమాలు ఉన్నా అవి ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ముఖ్యంగా డెకాయిట్ విషయంలో ముందుగా హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ను (Shruti Haasan) అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) రీప్లేస్ అయ్యింది. ఈ కాస్టింగ్ మార్పుల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇక గూఢచారి 2 తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందుతుండటంతో ప్రొడక్షన్ కొంచెం స్లోగా నడుస్తోంది. ఈ రెండు సినిమాలు 2025లోనే రానున్నాయని ప్రచారం జరుగుతున్నా, ఖచ్చితమైన రిలీజ్ డేట్ ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు.
సినిమా రిలీజింగ్ విషయంలో శేష్ ఒక క్లారిటీకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. టాలీవుడ్‌లో ఇప్పుడు రిలీజ్ క్యాలెండర్ ఓవర్‌లోడెడ్‌గా ఉంది. సమ్మర్ పూర్తిగా బుక్డ్ అయ్యింది. దసరా, దీపావళి సీజన్‌లలో కూడా పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్‌ను పక్కన పెట్టేశాయి. అలాంటప్పుడు శేష్ తన సినిమాలకు సరైన స్లాట్ చూడడం అవసరం. కాకపోతే, ఆలస్యం చేస్తూ పోతే ఏదో ఒక పెద్ద సినిమాతో క్లాష్ అయ్యే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం ఉన్న సినిమా మార్కెట్‌లో రెగ్యులర్‌గా కనబడే హీరోలే ప్రేక్షకులకు క్లోజ్‌గా ఫీల్ అవుతారు. శేష్ వరుస సినిమాలు ప్లాన్ చేస్తూనే ఉన్నా, వాటి రిలీజ్ విషయంలో స్పష్టత లేకపోవడం అభిమానులను నిరాశపరిచేలా మారుతోంది. నిజానికి శేష్ కు హిట్ కొట్టే టాలెంట్ ఉంది. కానీ సినిమా సినిమాకీ ఎక్కువ గ్యాప్ తీసుకుంటూ పోతే, మార్కెట్‌ను మళ్లీ సెటప్ చేసుకోవడానికి కష్టమవుతుంది. కాబట్టి ఇకనైనా శేష్ తన రూట్ మార్చుకుని, వరుసగా సినిమాలు రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తేనే బెటర్.