Dacoit: ‘డకాయిట్’ కథ ఇదేనా..? ఆసక్తిని పెంచుతుందిగా..!

Advertisement

అడవి శేష్.. టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరో అలాగే ప్రామిసింగ్ హీరో కూడా. అతని సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక అంచనాలు ఉంటాయి. ట్రేడ్ లో కూడా..! ప్రస్తుతం అతను ‘గూఢచారి 2 ‘ ‘డకాయిట్’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ‘గూఢచారి’ బ్లాక్ బస్టర్ అయ్యింది.. దాని సీక్వెల్ అంటే కచ్చితంగా హైప్ ఉంటుంది. ఇక ‘డకాయిట్’ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది. ఇందులో ఏది బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల సినిమాగా నిలిచి..

అడవి శేష్ ని టాప్ లీగ్లో చేరుస్తుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ప్రస్తుతం మనం ‘డకాయిట్’ సినిమా గురించి మాట్లాడుకుందాం. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి షానీల్ దర్శకుడు. ఇది వరకే ‘డకాయిట్’ కి సంబంధించి ఓ గ్లింప్స్ వదిలారు. అందులో హీరో అడవి శేష్, హీరోయిన్ శృతి హాసన్ తుపాకులతో దాడి చేసుకుంటున్నట్టు చూపించి ఆసక్తిని రేకెత్తించారు.

అయితే ఈ సినిమా కథ ఏంటి అనేది రివీల్ చేయలేదు.అందుతున్న సమాచారం ప్రకారం.. ఇందులో శృతి హాసన్, అడవి శేష్ ..లు మాజీ ప్రేమికులుగా కనిపిస్తారట. వీళ్ళ జీవితాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిస్థితుల వల్ల విడిపోయి..వీరు దొంగతనాలు చేయాల్సి వస్తుందట. ఆ తర్వాత మళ్ళీ అనుకోకుండా కలుస్తారట. ఆ తర్వాత ఏమైంది? అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు? ఎందుకు దొంగతనాలు చేయాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా అని తెలుస్తుంది.స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus