Adivi Sesh: వెనక్కి తగ్గిన అడివి శేష్..!

రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. ఈ క్రమంలో రిలీజ్ కు సిద్ధమైన చాలా సినిమాలు వెనక్కి తగ్గుతున్నాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. పలు భాషల్లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయడం రిస్క్ అని భావిస్తున్నారు నిర్మాతలు. దీంతో చాలా సినిమాలు వాయిదా పడుతున్నాయి.

తెలుగులో ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘భీమ్లానాయక్’ లాంటి సినిమాలు విడుదల వాయిదా వేసుకున్నాయి. తాజాగా ఓ యంగ్ హీరో సినిమా కూడా ఇప్పుడు వెనక్కి తగ్గింది. కుర్రహీరో అడివిశేష్ నటిస్తున్న ‘మేజర్’ సినిమా రిలీజ్ ను వాయిదా వేసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు చిత్రబృందం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయలేకపోతున్నామని తెలిపారు. ‘మేజర్’ సినిమా ఇండియా కోసం చేసిన సినిమా కాబట్టి దేశంలో పరిస్థితులు చక్కబడిన తరువాత సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.

గతంలో విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఈ సినిమాలో నటిస్తున్నారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకుడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus