Adivi Sesh: అడివి శేష్ మంచి మనస్సును మెచ్చుకుంటున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో సక్సెస్ రేట్ ఉన్న హీరోలలో అడివి శేష్ (Adivi Sesh) ఒకరని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీ హీరోగా అడివి శేష్ కు పేరుండగా అడివి శేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అడివి శేష్ తాజాగా మంచి మనస్సును చాటుకోగా ఆయన చేసిన పని సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. అడివి శేష్ లిటిల్ ఫ్యాన్ కు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు.

క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారిని ఆడించి చిన్నారి కళ్లలో అడివి శేష్ ఆనందాన్ని నింపారు. క్యాన్సర్ తో బాధ పడుతున్న చిన్నారి కోసం ఒకరోజు మొత్తం కేటాయించిన అడివి శేష్ తన అభిమాని కోసం చేసిన పనిపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అడివి శేష్ కు కొంతకాలం క్రితం తన అభిమాని అయిన ఈ చిన్నారి గురించి తెలిసింది. ఆ తర్వాత చిన్నారి కాల్స్ కు అడివి శేష్ స్పందిస్తూ వచ్చారని సమాచారం అందుతోంది.

అభిమానికి సర్ప్రైజ్ ఇవ్వాలనే ఆలోచనతో అడివి శేష్ ఒక రోజంతా అభిమాని ఇంట్లో ఉండి తన మంచి మనస్సును చాటుకున్నారు. చిన్నారితో అడివి శేష్ గడిపిన ఫోటోలను అడివి శేష్ టీం సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. అడివి శేష్ కొత్త ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అడివి శేష్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉంది. అడివి శేష్ కు సోషల్ మీడియాలో మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అడివి శేష్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. అడివి శేష్ అద్భుతమైన కథలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus