18 ఏళ్ల తర్వాత కొత్త ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న డాక్టర్ బాబు ఫ్యామిలీ..!

‘డాక్టర్ బాబు’.. ఈ పేరు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు.. ‘కార్తిక దీపం’ సీరియల్‌ని అందులోని వంటలక్క, డాక్టర్ బాబు వంటి క్యారెక్టర్లను ఆడియన్స్ ఎంతగానో ఓన్ చేసుకున్నారు.. అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించిన సీరియల్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది కూడా.. ఇక తాజాగా డాక్టర్ బాబుగా నటించిన నిరుపమ్ పరిటాల త్వరలో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నట్టు తెలిపారు.. అదేంటి.. నిరుపమ్, అతని భార్య మంజుల ఇద్దరూ స్టార్ యాక్టర్స్ కదా..

వాళ్లకిప్పటి వరకు సొంతిల్లు లేదా? అనే డౌట్ వస్తుంది కదా.. దాని గురించిన వివరాలు వీడియో ద్వారా వెల్లడించారు ఈ స్టార్ కపుల్.. వీడియోలో నిరుపమ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఇంటిని మా నాన్న బుక్ చేశారు.. గతంలో ప్రభుత్వం సినీ కార్మికుల కోసం మంజూరు చేసిన హౌసింగ్ సొసైటీ ద్వారా ఈ ఇల్లు వచ్చింది. నాన్న లేకపోవడం వల్ల.. ఆ ఇల్లు నాకు వచ్చింది. అయితే ఆ ఇల్లును బుక్ చేసి దాదాపు 15-18 సంవత్సరాలు కావొస్తోంది.

ఇక ముందుగా ఆ ఇంటిని 3 BHK అనుకున్నారు, కానీ తర్వాత దానిని డూప్లెక్స్ ఫ్లాట్‌గా తీర్చిదిద్దుతున్నారు.. ఇంటీరియల్ డిజైనింగ్ పనుల కారణంగానే ఆలస్యమవుతూ వస్తోంది’’ అన్నాడు. ఇక ఇంట్లో జరుగుతున్న పనుల గురించి మంజుల తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియో అప్‌లోడ్ చేసింది.. ఇళ్లంతా తిరిగి చూపిస్తూ ఎలా వర్క్ జరుగుతుందనేది వివరించింది.. ఈ స్టార్ కపుల్ కొత్త ఇంటికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఫ్యాన్స్, నెటిజన్లు అలాగే ఇతర నటీనటులు వీరికి విషెస్ తెలియజేస్తున్నారు. ఇక నిరుపమ్ – మంజుల విషయానికొస్తే.. వీరిద్దరు ‘చంద్రముఖి’ అనే సీరియల్‌లో లీడ్ క్యారెక్టర్స్ చేశారు. అలా కలిసి నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. కొద్ది రోజుల తర్వాత పెద్దలను ఒప్పించి లవ్ కమ్ అరైంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారీ జంట.. వీరికి ఓ బాబు ఉన్నాడు..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus