Vijay, Sneha: మరోసారి విజయ్ సినిమాలో సందడి చేయబోతున్న స్నేహ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి స్నేహ ఒకరు. ఈమె ఒక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో పెద్ద ఎత్తున నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా నటిగా తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించినటువంటి స్నేహ కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమై తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా హీరోలకు వదిన పాత్రలలో నటిస్తూ మెప్పించారు. ఇలా సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా స్నేహకు (Sneha) సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది. ఈమె 20 సంవత్సరాల తర్వాత తిరిగి నటుడు విజయ్ దళపతి సరసన నటించబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించిన లియో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా దసరాకు విడుదల కాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దళపతి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో హీరోయిన్ గా విజయ్ సరసన ప్రియాంక మోహన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం ఇక ఇందులో తండ్రి పాత్రలో నటించే విజయ్ కి జోడిగా స్నేహ నటించిన బోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక వీరిద్దరూ 20 సంవత్సరాల క్రితం హీరో హీరోయిన్లుగా వశీకర సినిమాలో నటించారు. అయితే 20 సంవత్సరాల తర్వాత తిరిగి ఈమె మరోసారి విజయ్ సినిమాలో నటించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇదివరకు ఈ పాత్రలో జ్యోతిక నటిస్తుంది అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ పాత్రలో నటించడానికి జ్యోతిక నో చెప్పడంతోనే స్నేహను సంప్రదించారని తెలుస్తుంది. మరి ఈ పాత్రలో నటించడానికి స్నేహ సై అంటారా లేక ఈమె కూడా వెనుకడుగు వేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags