వెంకీ – బాలయ్య – చరణ్..ఇది రెండో ఫైట్..!

ఈ సంక్రాంతి (Sankranti) సీజన్ మరోసారి సినీ ప్రేక్షకులకు హుషారెత్తిస్తోంది. నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) , విక్టరీ వెంకటేష్ (Venkatesh), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)  ఒకేసారి బాక్సాఫీస్ పోరాటానికి సిద్ధమయ్యారు. బాలయ్య తన డాకు మహారాజ్ (Daaku Maharaaj) , వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam), చరణ్ గేమ్ చేంజర్ (Game Changer) చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూడు చిత్రాలు విభిన్నమైన కాన్సెప్ట్ లతో రూపొందినవే కావడంతో ప్రేక్షకులలో ఆసక్తి మరింత పెరిగింది. 2019 సంక్రాంతికి కూడా ఇదే ముగ్గురు పోటీ పడిన సంగతి గుర్తుండే ఉంటుంది.

Sankranti

ఆ సంవత్సరంలో వినయ విధేయ రామతో (Vinaya Vidheya Rama) రామ్ చరణ్, కథానాయకుడుతో (NTR: Kathanayakudu) బాలకృష్ణ, ఎఫ్ 2తో (F2: Fun and Frustration) వెంకటేష్ ప్రేక్షకులను పలకరించారు. ఆ సీజన్‌లో వెంకటేష్ ఎఫ్ 2 చిత్రంతో బాక్సాఫీస్ విజేతగా నిలవగా, మిగిలిన రెండు చిత్రాలు నిరాశ పరిచాయి. ఇప్పుడు మరొకసారి ఇదే ముగ్గురు హీరోలు తారాస్థాయిలో పోటీ పడుతున్నారు. గేమ్ చేంజర్ జనవరి 10న విడుదలవుతుండగా, డాకు మహారాజ్ జనవరి 12న, సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న థియేటర్లలో సందడి చేయనున్నాయి.

ఈ చిత్రాలకు భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ (RRR)  వంటి ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో, గేమ్ చేంజర్ పై భారీ హైప్ ఉంది. బాలకృష్ణ, ఇప్పటికే మూడు సక్సెస్‌లు కొట్టిన నేపథ్యంలో, డాకు మహారాజ్ చిత్రంతో తన జోరును కొనసాగించాలని చూస్తున్నారు. వెంకటేష్, ఎఫ్ 2 మరియు ఎఫ్ 3 వంటి హిట్ సినిమాల తరువాత వస్తున్న ఈ కొత్త చిత్రంతో హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ మూడు చిత్రాలలో రెండు సినిమాలకు దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాకుండా, బాలయ్య చిత్రానికి నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా దక్కించుకున్నారు. దిల్ రాజు బ్యానర్‌కు ఈ మూడు సినిమాల విజయాలు చాలా కీలకం. సంక్రాంతి సీజన్‌లో ఈ భారీ పోటీలో విజయం సాధించే చిత్రం ఏదనేది అభిమానులతో పాటు ట్రేడ్ అనలిస్ట్‌లలో కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ మూడు ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తాయో చూడాలి.

తమన్ నాన్ స్టాప్ గేమ్.. ఆ సినిమాలకు ఎంత కష్టపడుతున్నాడంటే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus