మెగాస్టార్ చిరంజీవి 66 ఏళ్ళ వయసులో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ తోటి స్టార్ హీరోలకి ఛాలెంజ్ లు విసురుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం చిరు 4 సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ అయిన ‘గాడ్ ఫాదర్’, బాబీ దర్శకత్వంలో ఓ మూవీ, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ అయిన ‘భోళా శంకర్’, వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ ప్రాజెక్టు.. వంటి వాటిల్లో చిరు నటిస్తున్నారు.
ఇందులో… మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న ‘భోళా శంకర్’ మూవీ చిరంజీవికి 154వ సినిమా అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర(అనిల్ సుంకర) తన ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా… ‘క్రియేటివ్ కమర్షియల్స్’ అధినేత కె.ఎస్.రామారావు కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ చిత్రానికి రాంచరణ్ ఓ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాలి అనుకున్నారు.
ఈ మధ్య కాలంలో చిరు సినిమాలకి ఆయన సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న సందర్భాలను మనం చూస్తూ వస్తున్నాం. అయితే ‘తేజ్ ఐ లవ్ యు’ ప్రీ రిలీజ్ వేడుకలో ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్లో చరణ్ తో ఓ సినిమా చేయిస్తాను అని చిరు మాటిచ్చారు. కానీ ప్రస్తుతం చరణ్ చాలా బిజీ. దాంతో మాట నిలుపుకోలేని పరిస్థితి. అందుకే తన సినిమాకే ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ ను జత చేసి ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించారు చిరు.
గతంలో ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్లో చిరు.. ‘అభిలాష’ ‘ఛాలెంజ్’ ‘రాక్షసుడు’ ‘మరణ మృదంగం’ ‘స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్’ వంటి చిత్రాలు చేశారు.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!