Trisha, Kamal: కమల్‌ హాసన్‌ సినిమాలో సెకండ్‌ ఇన్నింగ్స్ బ్యూటీ… త్వరలో అఫీషియల్‌!

సెకండ్‌ ఇన్నింగ్స్‌ అని అంటే త్రిష ఒప్పుకుంటుందో లేదో కానీ.. ఇప్పుడు ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనే ఉంది. వరుస సినిమాలు చేస్తూ వచ్చి… ఒక్కసారిగా స్లో అయిపోయింది. ఇటు తెలుగులో, అటు తమిళంలో కొత్త నాయికల హడావుడి పెరగడం, ఈలోపు రిలేషన్‌ – పెళ్లి తదితర కారణాల వల్ల స్లో అయ్యింది. అయితే ఇప్పుడు తిరిగి జోరు పెంచింది. సీనియర్‌ స్టార్‌ హీరోల సినిమాలకు ఇప్పుడు ఆమె ఓ బెస్ట్‌ ఆప్షన్‌గా నిలిచింది. ఈ క్రమంలో కమల్‌ హాసన్‌ కొత్త సినిమాలో కూడా నటించబోతోంది.

కమల్‌ హాసన్‌, త్రిష (Trisha) కాంబినేషన్‌లో ఓ సినిమాలో నటిస్తారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు పక్కాగా నిర్ణయాలు అయిపోయాయట. ‘ఇండియన్‌ 2’ సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు కమల్‌ హాసన్‌. ఈ సినిమా తర్వాత కమల్‌ మణిరత్నం దర్శకత్వంలో నటిస్తారని ఇప్పటికే అధికారిక సమాచారం వచ్చింది. KH 234తో రూపొందుతున్న ఈ సినిమాలో త్రిషను తీసుకోవడం దాదాపు ఖాయమట.

చాలా కాలం తరవాత కమల్‌ – మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాకు హిట్‌ కాంబినేషన్‌ అయిన త్రిష కూడా కలవడంతో ఇంకా అంచనాలు పెరిగాయి అని చెప్పొచ్చు. ఇప్పటివరకు కమల్‌ – త్రిష ‘తూంగా వనం’ / ‘చీకటి రాజ్యం’, ‘మన్మధన్‌ అంబు’ / ‘మన్మధ బాణం’ సినిమాల్లో నటించారు. ఆ రెండు సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి విజయమే అందుకున్నాయి.

దీంతో ఇప్పుడు ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఆడుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో యువ కథానాయకులు దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి కూడా నటిస్తారు అనే టాక్‌ నడుస్తోంది. థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. త్వరలో భారీ స్థాయిలో ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుంది అని చెబుతున్నారు. ఆ రోజు మరికొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉంటాయి అని చెబుతున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus