Matka: ఆ సినిమా పనులు మళ్లీ మొదలుపెట్టిన వరుణ్‌తేజ్‌.. గ్యాప్‌ ఎన్ని రోజులంటే?

ఓ సినిమా షెడ్యూల్‌ – షెడ్యూల్‌కి సుమారు మూడు నెలల గ్యాప్‌ ఉంది అంటే మీరు నమ్ముతారా? కానీ అంత గ్యాప్‌ వచ్చింది, ఇప్పుడు ఆ సినిమా కూడా మొదలైంది. ఇంకా కచ్చితంగా చెప్పాలి అంటే 175 రోజుల గ్యాప్‌ తర్వాత సినిమా కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేశారు. ఈ మేరకు ఆ హీరో సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. దీంతో ఈ విషయం, ఆ సినిమా షూటింగ్‌ సమాచారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంత గ్యాప్‌ తర్వాత సెట్‌లో అడుగుపెట్టిన హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కాగా.. ఆ సినిమా ‘మట్కా’ (Matka) .

కరుణ కుమార్‌ (Karuna Kumar) దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న సినిమా ఇది. చాలా నెలల క్రితమే మొదలైన ఈ సినిమా వివిధ కారణాల వల్ల కొత్త షెడ్యూల్‌లోకి రాకుండా ఆగింది. అయితే ఇప్పుడు 40 రోజుల షూటింగ్‌ షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో రూపొందించిన ప్రత్యేకమైన సెట్‌లో హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో వరుణ్‌ తేజ్‌ ‘‘కొత్త శక్తి, సరి కొత్త ఆకాంక్షలతో 175 రోజుల తర్వాత తిరిగి సెట్స్‌లోకి వచ్చాను’’ అని ఎక్స్‌ (మాజీ ట్విటర్‌)లో రాసుకొచ్చారు..

‘మట్కా’ రెట్రో మాయాజాలానికి జీవం పోయడానికి సిద్ధమయ్యాను అని కూడా పోస్టులో రాశారు వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం వరుణ్‌, మీనాక్షి చౌదరిపై (Meenakshi Chowdary) కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వివిధ కాలాల్ని చూపిస్తూ, పీరియాడికల్‌ కథతో ‘మట్కా’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. 1980ల కాలంలో ఉత్తరాంధ్ర ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసిన బ్రాకెట్‌ అలియాస్‌ మట్కా అనే జూదం తరహా ఆట నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

ఇందులో వరుణ్‌తేజ్‌ నాలుగు విభిన్నమై కోణాల్లో కనిపించే పాత్రలో నటిస్తున్నాడు.అన్నట్లు ఈ సినిమాలో నిజ జీవిత సంఘటనలను చూపించే ప్రయత్నం చేస్తున్నారట దర్శకుడు కరుణ కుమార్‌. ఇప్పటికే ఆయన ‘పలాస’ సినిమాతో ఇదే పని చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus