ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల విషయంలో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. చరణ్, తారక్ కు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటంతో పాటు రాజమౌళి డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలకు అందని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ మూవీ డే1 రికార్డులు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ కావడానికి చాలా సంవత్సరాల సమయం పట్టే ఛాన్స్ ఉంది. నైజాంలో ఆర్ఆర్ఆర్ మూవీ 110 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే సీడెడ్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.
తెలుగు రాష్ట్రాలలో గతంలో ఏ సినిమా సాధించని స్థాయిలో ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. మహేష్ బాబు సినిమాతో మళ్లీ రాజమౌళి ఈ రికార్డులను బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పట్లో ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్ కావడం మాత్రం సాధ్యం కాదనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధించడంతో పాటు దర్శకుడిగా ఈ సినిమా జక్కన్న స్థాయిని పెంచింది. సినిమా విషయంలో కొన్ని విమర్శలు వ్యక్తమైనా మెజారిటీ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చేసింది.
2023 ఆరంభంలో మహేష్ జక్కన్న కాంబో మూవీ మొదలయ్యే ఛాన్స్ ఉంది. 2025 సంవత్సరంలో ఈ సినిమా విడుదలవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ జక్కన్న ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టైమ్ ట్రావెల్ కథాంశంతో జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారు. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని భారీగానే రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది.
సినిమాసినిమాకు రాజమౌళికి క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. రాజమౌళి ప్రస్తుతం రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నారని తెలుస్తోంది. సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని రాజమౌళి తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారని బోగట్టా.