అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూడగా ఈ సినిమా సోనీ లివ్ ప్రకటన ప్రకారం ఈ నెల 29వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే ఏజెంట్ హక్కులను కొనుగోలు చేసిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ కోర్టును ఆశ్రయించడంతో ఈ సినిమా మరోమారు వాయిదా పడింది. ఏజెంట్ ఓటీటీ రిలీజ్ లేనట్టేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా కోసం ఎదురుచూతున్న అఖిల్ ఫ్యాన్స్ కు షాక్ అంటూ సోషల్ మీడియా వేదికగా కథనాలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. అక్కినేని అఖిల్ కానీ నిర్మాత అనిల్ సుంకర కానీ ఏజెంట్ ఓటీటీ సమస్యల గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఏజెంట్ సినిమా 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా నిర్మాతలకు ఈ సినిమా ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చింది.
అక్కినేని అభిమానులలో చాలామంది (Agent) ఏజెంట్ సినిమాను థియేటర్లలో చూడలేదు. కనీసం ఓటీటీలో అయినా ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. ఏజెంట్ సినిమాను ఏ క్షణాన మొదలుపెట్టారో తెలీదు కానీ అప్పటినుంచి ఇప్పటివరకు అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఈ సినిమా ఫలితం నిర్మాతలను ఎంతగానో హర్ట్ చేసింది.
అక్కినేని అఖిల్ మార్కెట్ ను సైతం ఈ సినిమా దెబ్బ తీసిందని సోషల్ మీడియా వేదికగా కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అక్కినేని అఖిల్ కొత్త సినిమాకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉండగా త్వరలో కొత్త సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. అఖిల్ తర్వాత సినిమా స్క్రిప్ట్ విషయంలో జక్కన్న సహాయసహకారాలు అందించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైరల్ అవుతున్న ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!