ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్(Melbourne) సిటీ లో అగ్రజీత మూవీ ప్రెస్ మీట్

రాహుల్ కృష్ణ మరియు ప్రియాంక నోముల హీరో హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వం లో సందీప్ రాజ్ ఫిలిమ్స్ మరియు వాసవి త్రివేది ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అగ్రజీత. ఇది ఒక భిన్నమైన కథ. ఒక జీవి మరణం అనంతరం తన జ్ఞాపకాలను అణువు ద్వారా మరో జీవి లోకి వెళ్లే ఒక శాస్త్రీయ కథ. ఈ చిత్రం ఆద్యంతం ఆస్ట్రేలియా దేశంలోని గ్రేట్ ఓషన్ రోడ్ (Great Ocean Road), రెడ్ వుడ్ అడవుల్లో (Red Wood Forest), మంచు ప్రదేశాలైన మౌంట్ బుల్లర్ (Mount Buller) మరెన్నో అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ పూర్తిచేసుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.

అయితే షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్(Melbourne) సిటీ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా

హీరోయిన్ ప్రియాంక నోముల మాట్లాడుతూ “అగ్రజీత సినిమా లో పని చేసిన ప్రతిఒక్కరికి నా ధన్యవాదాలు. అందరం కష్టపడి పని చేసాము. దర్శకుడు సందీప్ అంటే మా అందరికి ఇష్టం, అయన లేకపోతె ఈ సినిమా లేదు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వుతుంది. కథ అందించిన కృష్ణ గారు సైంటిఫిక్ రీసెర్చ్ చేసారు. సినిమా అద్భుతంగా ఉంటుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది” అని తెలిపారు.

హీరో రాహుల్ కృష్ణ మాట్లాడుతూ “ఇది నా మొదటి సినిమా. నన్ను నమ్మి సందీప్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా కి పని చేసిన అందరు వాళ్ళ సొంత సినిమా లాగా పని చేసారు. సినిమా హిట్ అవ్వాలి” అని కోరుకున్నారు.

కథ అందించిన కృష్ణ రెడ్డి లోక మాట్లాడుతూ “ఈ సినిమా లో పని చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు, అందరం చాలా కష్టపడి పని చేసాము. సినిమా లో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి, సినిమా అద్భుతంగా వస్తుంది. నా కథని సినిమా గా చేసినందుకు డైరెక్టర్ కి మరియు నిర్మాతలకి థాంక్స్” అని తెలిపారు.

దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ “షూటింగ్ స్టార్ట్ చేసే ముందు చిన్న సినిమా గా చేద్దాం అనుకున్నాం కానీ స్క్రిప్ట్ బాగా వచ్చింది, అందుకు గ్రాండ్ గా చేసాం. నేను రాహుల్, కృష్ణ మరియు ప్రియాంక ఈ ముగ్గురికి థాంక్స్ చెప్పాలి. కృష్ణ లేకపోతే నేను ఈ సినిమా పూర్తి చేసేవాడిని కాదు. ప్రియాంక కూడా హీరోయిన్ గా చేస్తూనే అందరితో కో ఆర్డినేట్ చేసేది. షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది, జులై లో విడుదల చేద్దాం అనుకుంటున్నా” అని తెలిపారు.

వాసవి త్రివేది ప్రొడక్షన్స్ వారు మాట్లాడుతూ “మా సినిమా లో పని చేసిన నటి నటులు మరియు టెక్నిషన్స్ అందరు టాలెంట్ ఉన్నవాళ్లు. సందీప్ గారు అందరికి మంచి ఎనర్జీ ఇస్తారు. రాహుల్ అండ్ ప్రియాంక బాగా నటించారు. అందరం టీం వర్క్ గా పని చేసాము. సినిమా పెద్ద సక్సెస్ కావాలి” అని కోరుకున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus