టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘ఆహా’ అనే ఓటీటీ వేడుకను స్థాపించి ఎంతగా ప్రచారం చేస్తున్నారో తెలిసిందే. ఇందులో భాగంగా సమంతను రంగంలోకి దింపి ఇంటర్వ్యూలు చేయిస్తున్నారు. విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలతో పాటు మెగాస్టార్ చిరంజీవి లాంటి క్రేజీ హీరోలను తీసుకొని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ ని కూడా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఎపిసోడ్ ని జనవరి 1న ప్రసారం చేయబోతున్నారు.
ఈ ఎపిసోడ్ ప్రచారంలో భాగంగా బన్నీని మెగాస్టార్ అని సంభోదించారు. ‘మెగాస్టార్ అల్లు అర్జున్ స్పెషల్ ఎపిసోడ్’ అంటూ సోషల్ మీడియాలో అతి చేశారు. బన్నీని అందరూ స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆ ట్యాగ్ ని పక్కన పెట్టి అల్లు అర్జున్ ని మెగాస్టార్ చేసేసింది ‘ఆహా’. కావాలనే ఇలా చేశారంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. చిరంజీవి తరువాత మెగాస్టార్ అయ్యే అర్హత రామ్ చరణ్ కే ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
విషయం సీరియస్ అవుతుండడంతో తప్పుని సరిదిద్దుకునే పనిలో పడింది ‘ఆహా’. వెంటనే ప్రోమోల నుండి మెగాస్టార్ అనే పదాన్ని తీసేశారు. ట్విట్టర్ వేదికగా ‘ఆహా’ సంస్థ మెగాభిమానులకు క్షమాపణలు చెప్పింది. తెలియకుండా చేసిన పొరపాటని.. దీని కారణంగా బాధ పడిన ప్రతీ ఒక్కరికి క్షమాపణలు అంటూ ట్విట్టర్ లో పేర్కొంది. అలానే ”There’s only one Megastar and we all know it” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!