వ్యాపారవేత్తలకు ఊతమిచ్చేలా ఓ టీవీ షో హిందీలో వస్తుంటుంది గుర్తుందా? ‘షార్క్ ట్యాంక్’ దాని పేరు. ఔత్సాహిక వ్యాపరవేత్తలు అందులో పాల్గొని తమ ఆలోచనలు, వ్యాపారాల గురించి చెబితే… అక్కడ ఉన్న సీనియర్ వ్యాపారవేత్తలు విని పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తారు. ఈ కార్యక్రమం ద్వారా చాలామంది ఔత్సాహికులు వెలుగులోకి వచ్చారు. మంచి మంచి వ్యాపారాలు కూడా జనాలకు తెలిశాయి. ఇప్పుడు ఆహా కూడా ఇలాంటి ఓ ఆలోచన చేసింది. అయితే ఇది కేవలం మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మాత్రమే.
మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ, మహిళలు వ్యాపార రంగంలోనూ దూసుకెళ్లేలా చేయటానికి ఈ రియాలిటీ షో అని అర్థమవుతోంది. దీనికి ‘నేను సూపర్ ఉమెన్’ అని పేరు పెట్టారు. వినూత్న మార్గాలను సూచిస్తూ, మహిళలకు మార్గదర్శకం చేస్తూ వారికి ప్రత్యక్ష అనుభవం ఏర్పడేలా ఈ షో ద్వారా చేయాలని అనుకుంటున్నారు. ఇందులో ఉండే ప్యానల్‌ను ఏంజెల్స్ అని పిలుస్తారు. ఔత్సాహిక మహిళా వ్యాపారులు వారి ఆలోచనలను ఏజెంల్స్‌కు వివరిస్తే.. వారు ఓకే అనుకుంటే ఆఫర్ ఇస్తారు.
వివిధ రంగాల్లో గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ వ్యాపార వేత్తలను ఏంజెల్స్‌ను ఈ కార్యక్రమంలో తీసుకొస్తున్నారు. డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని, క్వాంటెలా ఇన్క్ యొక్క వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీధర్ గాది, సిల్వర్ నీడెల్ వెంచర్స్ రేణుకా బొడ్లా, అభి బస్ వ్యవస్థాపకుడు సుధాకర్ రెడ్డి, దొడ్ల డెయిరీ దొడ్ల దీపా రెడ్డి, నారాయణ గ్రూప్ నుండి సింధూర పొంగూరు ఈ ఏంజెల్స్‌లో ఉన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయకుడు శ్రీరామ చంద్ర హోస్ట్‌గా వ్యవహరిస్తాడు. అయితే హిందీలో షార్క్ ట్యాంక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రెండు సీజన్లలోనూ అదిరిపోయే ఆవిష్కరణలు, ఆఫర్‌లు కనిపించాయి. మరి తెలుగులో ఏ మేరకు ఆ స్పందన ఉంటుందో చూడాలి. హిందీ రేంజిలో హిట్ అయితే.. ఔత్సాహిక మహిళలకు, ఆహా (Aha) ఓటీటీకి మంచి లాభం అని చెప్పాలి.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!