Brahmanandam: హోస్ట్ గా బ్రహ్మీ.. ఓకే చెబుతారా..?

  • November 2, 2022 / 10:19 AM IST

తెలుగులో మొదలైన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ క్రియేటివ్ కంటెంట్ తో దూసుకుపోతుంది. మొదట్లో ‘ఆహా’లో ఎక్కువగా డబ్బింగ్ సినిమాలే కనిపించేవి. కానీ మెల్లమెల్లగా పెద్ద సినిమాల రైట్స్ ను దక్కించుకోవడం.. ఒరిజినల్ కంటెంట్ తో సినిమాలు, సిరీస్ లు చేయడం మొదలుపెట్టింది. దీంతో సబ్ స్క్రైబర్స్ పెరిగారు. అలానే సరికొత్త టాక్ షోలను ప్లాన్ చేస్తోంది ‘ఆహా’. సమంత లాంటి స్టార్ హీరోయిన్ తో ఓ షోని నిర్వహించింది. ఇప్పుడేమో బాలయ్యతో ‘అన్ స్టాపబుల్’ అనే షోని నిర్వహిస్తున్నారు.

నిజానికి ఇది రెగ్యులర్ షోనే కానీ బాలయ్యను హోస్ట్ గా తీసుకొచ్చి పెద్ద ప్లానే వేసింది ‘ఆహా’ టీమ్. తొలిసారి బాలయ్య హోస్ట్ చేస్తోన్న షో కావడంతో జనాల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్లే సీజన్ 1 సూపర్ హిట్ అయింది. ‘ఆహా’ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు సీజన్ 2కి సంబంధించిన ఒక్కో ఎపిసోడ్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు ఎపిసోడ్స్ ను రిలీజ్ చేయగా అవి బాగా క్లిక్ అయ్యాయి.

 

ఇప్పుడు మూడో ఎపిసోడ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ షో స్ఫూర్తితోనే దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ షో ప్లాన్ చేసింది ‘ఆహా’. అలానే ఇప్పుడు బ్రహ్మానందంని రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. బ్రహ్మానందంతో ఓ టాక్ షోని నిర్వహించడానికి ‘ఆహా’ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానికి బ్రహ్మానందం కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆహా, బ్రహ్మానందం మధ్య డీల్ నడుస్తోంది.

రెమ్యునరేషన్, ప్యాకేజ్ ఫైనల్ అయితే వెంటనే షోని మొదలుపెడతారట. ముంబైకి చెందిన ఓ టీమ్ ఈ షో కోసం వర్క్ చేయనుంది. బ్రహ్మానందం ఇదివరకు ఓ షోని హోస్ట్ చేశారు. అది పెద్దగా క్లిక్ అవ్వలేదు. మరి ‘ఆహా’ షోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus